శరత్‌ బాబు ఫుడ్‌ సీక్రెట్‌ ఇదే.. కొన్నేళ్లుగా ఆ రెండు కట్‌.. కారణం తెలిస్తే తినడం మానేస్తారేమో?

Published : May 22, 2023, 07:11 PM IST

సీనియర్‌ నటుడు శరత్‌బాబు మొన్నటి వరకు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. కానీ అనూహ్యంగా అనారోగ్యం బారిన పడి మరణించారు. కానీ ఆయన 71ఏళ్లు బతికారు. చివరి వరకు చాలా ఎనర్జిటిక్‌గానూ ఉండేవారు. ఆయన తీసుకునే ఫుడ్‌ గురించి తెలిస్తే మైండ్‌ బ్లాంక్‌ అయిపోతుంది.  

PREV
15
శరత్‌ బాబు ఫుడ్‌ సీక్రెట్‌ ఇదే.. కొన్నేళ్లుగా ఆ రెండు కట్‌.. కారణం తెలిస్తే తినడం మానేస్తారేమో?

సెలబ్రిటీలు ఫుడ్‌ విషయంలో చాలా కేర్‌ తీసుకుంటారు. చాలా లిమిటేషన్స్ ఫాలోఅవుతుంటారు. అందుకే చాలా వరకు యంగ్‌గా, అందంగా కనిపిస్తుంటారు. అరవై ఏళ్లు వచ్చినా కుర్రాడిలానే కనిపిస్తుంటారు. వారిలో ఎనర్జీ మాత్రం అన్‌లిమిటెడ్‌. తాజాగా చనిపోయిన నటుడు శరత్‌బాబు కూడా కఠినమైన డైట్‌ని మెయింటేన్‌ చేసేవారట. తన ఆహారపు అలవాట్లు, తీసుకునే ఫుడ్‌ గురించి సీక్రెట్‌ బయటపెట్టారు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు శరత్‌బాబు. తాజాగా ఆయన కన్నుమూసిన సందర్భంగా ఈ విషయాలు వైరల్‌ అవుతున్నాయి. 
 

25

శరత్‌బాబు తన రోజు వారి కార్యక్రమాలు తెలిపారు. ఆయన మార్నింగ్‌ ఐదు గంటలకు లేస్తారట. వ్యాయామాలు చేస్తానని తెలిపారు. ఫ్రెష్‌ అప్‌ అయిన అనంతరం టిఫిన్‌ తీసుకుంటారట. టిఫిన్‌లో మార్నింగ్‌ కేవలం ఫ్రూట్స్ మాత్రమే తీసుకుంటారట. ఇంట్లో ఉంటే మాగ్జిమమ్‌ పండ్లు తీసుకుంటానని తెలిపారు. బయట ఉంటే అక్కడ దొరికే వాటిని బట్టి ప్రయారిటీ ఉంటుందని తెలిపారు. 
 

35

ఇక లంచ్‌లో మిల్లెట్స్ తీసుకుంటారట. కచ్చితంగా మధ్యాహ్నం ఆయన చిరు ధాన్యలతో తయారు చేసిన ఫుడ్‌నే తీసుకుంటానని తెలిపారు. మిల్లెట్స్ తోపాటు కాయగూరలు, పెరుగు వంటివి లంచ్‌లో తీసుకుంటాడట. శరీరానికి, ఎనర్జీనిచ్చేవి ఏవి అవసరమో అవే తీసుకుంటానని చెప్పారు శరత్‌బాబు. ఇక సాయంత్రం సమయంలో ఫుల్కాల్లాంటివి, టిఫిన్‌ లాంటివి తీసుకుంటాడట. ఇక చాలా ఏళ్లుగా ఆయన రెండు ఐటెమ్స్ ని మాత్రం పక్కాగా మానేశారట. అందులో ఒకటి వైట్‌ రైట్‌. అది మానేసి చాలా ఏళ్లు అవుతుందన్నారు శరత్ బాబు. అందులో మనకు ఉపయోగపడే న్యూట్రిషన్‌ భాగం పై పొట్టు పశువులకు వేస్తున్నాం, పనికిరాని పిప్పి మనం తింటున్నామని, దాని వల్ల మనకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు శరత్‌బాబు. పనికి రానిది మానేస్తే మంచిదని తెలిపారు. 
 

45

 నాన్‌ వెజ్‌ గురించి చెబుతూ ఓ షాకింగ్‌ విషయాన్ని బయటపెట్టారు శరత్‌బాబు. మన టేస్ట్ బర్డ్స్ ని సంతృప్తి పర్చడం కోసం ఇతర జీవిని చంపే అధికారం మనకు లేదని తాను చదివాడట. చెట్లకు సంబంధించి ఓ కొమ్మ కట్‌ చేసినా, ఓ కాయ కట్‌ చేసినా అలాంటి పది కొమ్మలు, కాయలు వస్తాయి. కానీ ఓ జీవిని చంపేస్తే మరో పది జీవులు రావు కదా అని తెలిపారు. సెంట్రల్‌ నెర్వ్ సిస్టమ్‌ మొక్కలకు ఉండదు, కాబట్టి వాటిని మనం గాయం చేసినట్టు కాదు, కానీ పశువులు, జీవులకు సెంట్రల్‌ నెర్వ్స్ సిస్టమ్ ఉంటుందన్నారు. అందుకే తాను నాన్‌ వెజ్‌ మానేసినట్టు తెలిపారు.

55

ఈ సందర్భంగా ఓ ఉదాహరణ చెప్పారు.. కర్నాటకలో ఓ వెయిట్‌ లిఫ్టర్‌ తిండికి లేక ఆకులే తీనేవాడట. అయినా అతను గట్టిగా ఉన్నాడు, వెయిట్‌ లిఫ్టింగ్‌లో ఛాంపియన్‌ అయ్యాడు. ఆకులు తినే మేక కొండలెక్కుతుంది, మేకలు తినే మనిషి మంచమెక్కుతున్నాడు అంటుంటారు అది నిజమే అని శరత్‌బాబు వెల్లడించారు. గుర్రం వేగంగా పరిగెడుతుంది, అది ఆకులే తింటుంది, ఏనుగు బలంగా ఉంటుంది. అది ఆకులే తింటుంది. ఇలా బలంగా ఉన్నవేవైనా నాన్‌ వెజ్‌ తినవు అని, అవి ఆరోగ్యంగా ఉంటాయని వెల్లడించారు శరత్‌బాబు. మనం కూడా నాన్‌ వెజ్‌ మానేస్తే ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు సీనియర్‌ నటుడు. ఓ రకంగా ఆయన నేటి తరానికి ఇన్‌స్పైరింగ్‌ వర్డ్స్ చెప్పారని చెప్పొచ్చు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories