బ్రహ్మానందం కోడలు ఐశ్వర్య బ్యాక్ గ్రౌండ్ ఇదే... కోడలికి మామయ్య విలువైన బహుమతి!

Published : Aug 19, 2023, 04:58 PM ISTUpdated : Aug 19, 2023, 05:02 PM IST

బ్రహ్మానందం చిన్న కొడుకు సిద్దార్థ వివాహం వైభవంగా జరిగింది. బ్రహ్మానందం చిన్న కోడలు పేరు ఐశ్వర్య కాగా ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటో చూద్దాం...   

PREV
16
బ్రహ్మానందం కోడలు ఐశ్వర్య బ్యాక్ గ్రౌండ్ ఇదే... కోడలికి మామయ్య విలువైన బహుమతి!
Tollywood, Brahmanandam, Siddhartha,Marriage


నటుడు బ్రహ్మానందం రెండో కుమారుడు సిద్ధార్థ వివాహం ఆగస్టు 18న రాత్రి ఘనంగా జరిగింది. హైదరాబాద్ గచ్చిబౌలి అన్వయ కన్వెన్షన్స్ లో జరిగింది. బ్రహ్మానందంకి ఇద్దరు కుమారులు కాగా పెద్ద కొడుకు రాజా గౌతమ్. హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజా అంతగా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం అడపాదడపా చిత్రాలు చేస్తున్నారు. రాజాకు వివాహమై పిల్లలున్నారు. రాజాకు కొన్ని వ్యాపారాలు ఉన్నట్లు సమాచారం. 

26
Tollywood, Brahmanandam, Siddhartha,Marriage


రెండో కుమారుడు సిద్ధార్థ. ఇతడు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. సిద్ధార్థ చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నారు. అందుకే సిద్ధార్థ గురించి తెలిసింది తక్కువే. ఇటీవల సిద్ధార్థ్ కు హైదరాబాద్ కి చెందిన ఐశ్వర్య  అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. ఈ శుక్ర‌వారం సిద్దార్థ-ఐశ్వర్యల వివాహం ఘనంగా జరిగింది. 

36
Tollywood, Brahmanandam, Siddhartha,Marriage


వందల కోట్ల ఆస్తి, పరిశ్రమలో పేరు పలుకుబడి ఉన్న బ్రహ్మానందం ఇంటికి కోడలిగా వచ్చిన ఐశ్వర్య ఎవరనే ఆసక్తి అందరిలో ఉంది. ఐశ్వర్య వివరాలు పరిశీలిస్తే...  బూర వినయ్ కుమార్, పద్మజ దంపతుల పుత్రిక ఐశ్వర్య. 

46
Tollywood, Brahmanandam, Siddhartha,Marriage


ఐశ్వర్య తల్లి పద్మజ హైదరాబాద్ లో పేరున్న గైనకాలజిస్ట్, ఐ వి ఎఫ్ స్పెషలిస్ట్. ఐశ్వర్య సైతం ఎంబిబిఎస్ చేశారు. డాక్టర్ ఫ్యామిలీకి చెందిన డాక్టర్ ని బ్రహ్మానందం కోడలిగా తెచ్చుకున్నాడు. ఐశ్వర్యతో పాటు ఆమె కుటుంబం బ్రహ్మానందంకి ఎంతగానో నచ్చిందట. నిశ్చితార్థం రోజే కోడలికి డైమండ్ నెక్లెస్ బహుమతిగా ఇచ్చాడట. 

56
Tollywood, Brahmanandam, Siddhartha,Marriage

సిద్ధార్థ, ఐశ్వర్యల వివాహ మహోత్సవానికి మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజ‌ర‌య్యారు.

66
Brahmanandam

నందమూరి బాలకృష్ణ, మంచు మోహన్ బాబు, మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్, కోట శ్రీనివాస రావు, రాజశేఖర్ జీవిత దంపతులు, రామ్ చరణ్ ఉపాసన దంపతులతో పాటు చిరంజీవి సతీమణి సురేఖ, పెద్దమ్మాయి సుస్మిత, శ్రీకాంత్ కుటుంబ సభ్యులు విచ్చేశారు.  సాయి కుమార్ ఫ్యామిలీ, మంచు విష్ణు దంపతులు, మంచు మనోజ్ దంపతులు, దర్శకులు కోదండరామిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్, శేఖర్ కమ్ముల, నటులు రావు రమేష్, ఆలీ ఫ్యామిలీ, ఎల్బీ శ్రీరామ్, నిర్మాతలు శివలెంక కృష్ణ ప్రసాద్, బెల్లంకొండ సురేష్, అచ్చిరెడ్డి, ఆదిశేషగిరిరావు, కెఎల్ నారాయణ, రఘు బాబు తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
 

click me!

Recommended Stories