నల్గొండలో అల్లు అర్జున్‌ హల్‌చల్‌.. వేలాదిగా అభిమానులు.. బన్నీ క్రేజ్‌కి మైండ్‌ బ్లాక్‌..

Published : Aug 19, 2023, 04:50 PM ISTUpdated : Aug 19, 2023, 04:53 PM IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. నల్గొండలో సందడి చేశారు. ఓ కన్వెన్షన్‌ సెంటర్‌ని ప్రారంభించడానికి ఆయన నల్గొండకి వెళ్లారు. అక్కడ బన్నీ కోసం అభిమానులు బ్రహ్మరథం పట్టారు.   

PREV
16
నల్గొండలో అల్లు అర్జున్‌ హల్‌చల్‌.. వేలాదిగా అభిమానులు.. బన్నీ క్రేజ్‌కి మైండ్‌ బ్లాక్‌..

`పుష్ప2` సినిమాతో బిజీగా ఉన్న అల్లు అర్జున్‌.. చాలా రేర్‌గా బయట కనిపిస్తుంటారు. కానీ ఆయన తాజాగా ఓ ప్రైవేట్‌ ఈవెంట్‌ కోసం బయటకు వచ్చారు. తన మామ కోసం నల్గొండకి వచ్చారు. తన మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి నిర్మించిన కంచర్ల కన్వెన్షన్‌ హాల్‌ని శనివారం బన్నీ అతిథిగా వచ్చి ప్రారంభించారు. 
 

26

వైట్‌ అండ్‌ వైట్‌లో వచ్చిన బన్నీ సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. అందరి దృష్టి ఆయనపైనే పడింది. ఇక అభిమాన హీరో వస్తున్నారని తెలిసి నల్గొండ జిల్లా సమీపంలోని అభిమానులంతా భారీగా తలరి వచ్చారు. వేలాది మంది ఫ్యాన్స్ రావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. బన్నీ ఫ్యాన్స్ తాకిడి చూసి వచ్చిన రాజకీయ నాయకులు సైతం షాక్‌ అవుతున్నారు. 
 

36

బన్నీని అభిమానులు, నిర్వాహకులు పెద్ద గజమాలతో ఆహ్వానించారు. ఫ్యాన్స్ చూపించిన ప్రేమకి అల్లు అర్జున్‌ ఫిదా అయ్యారు. వారికి అభివాదం తెలిపిన అనంతరం కన్వెన్షన్‌ హాల్‌ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బన్నీతోపాటు మామ కంచర్ల చంద్రశేఖర్‌ రెడ్డి, నల్గొండ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా, పెద్దవూర మండలంలోని కొంతగూడెం గ్రామంలో  వెయ్యి మంది కెపాసిటి గల ఈ కంచర్ల కన్వెన్షన్‌ హాట్‌ని నిర్మించారు.
 

46

ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి బన్నీ మాట్లాడుతూ, ఈ ఫంక్షన్‌గా ఇంతటి ఘన విజయం చేసిన అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు. తన ఆర్మీకి ఆయన ప్రత్యేకంగా థ్యాంక్స్‌ చెప్పారు. వారు రావడంలో వల్లే ఇది సక్సెస్ అయ్యిందన్నారు. అలాగే నల్గొండ పోలీస్‌ డిపార్ట్ మెంట్‌కి కూడా బన్నీ థ్యాంక్స్ చెప్పారు. 

56

మరోవైపు తమ ఊరు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతో మామ చంద్రశేఖర్‌రెడ్డి ఈ కన్వెన్షన్‌ హాల్‌ని నిర్మించారని, ఆయనకు అభినందనలు తెలిపారు. అభిమానుల ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు బన్నీ.  చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె అయిన స్నేహారెడ్డిని 2011లో అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు.
 

66

ప్రస్తుతం అల్లు అర్జున్‌..  ప్రస్తుతం `పుష్ప2` సినిమా చేస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుంది. ఫహద్‌ ఫాజిల్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్న ఇందులో అనసూయ, సునీల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రమిది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ మూవీ రిలీజ్‌ కాబోతుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories