ఆగని 'ఆచార్య' వివాదం.. బిజియం అందువల్లే చెడిపోయిందా, కొరటాలపై మణిశర్మ షాకింగ్ కామెంట్స్

First Published Nov 29, 2022, 4:42 PM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్, మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. వరుస సూపర్ హిట్స్ ఇచ్చిన  కొరటాల శివకి  ఈ చిత్రం తొలి ఎదురుదెబ్బ.

మెగా పవర్ స్టార్ రాంచరణ్, మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. వరుస సూపర్ హిట్స్ ఇచ్చిన  కొరటాల శివకి  ఈ చిత్రం తొలి ఎదురుదెబ్బ. ఆచార్య తర్వాత గాడ్ ఫాదర్ రిలీజ్ అయినప్పటికీ మెగా అభిమానులు ఆచార్య ఫెయిల్యూర్ ని ఇంకా మరచిపోలేకున్నారు. కొరటాల స్క్రిప్ట్, దర్శకత్వం పూర్తిగా బెడిసికొట్టాయి. దీనికి తోడు సంగీతం పరంగా మణిశర్మ పూర్తిగా చేతులెత్తేశారు.   

ఫలితంగా చిరంజీవి కెరీర్ లోనే ఆచార్య బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంతో నిర్మాతలు తీవ్రంగా నష్టపోయారు. బయ్యర్లు నష్టపోవడంతో చిరంజీవి, రాంచరణ్ తమ రెమ్యునరేషన్ కొంత భాగం తిరిగి ఇచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి. 

అయితే ఆచార్య విషయంలో ఏదో ఒక వివాదం తెరపైకి వస్తూనే ఉంది. సినిమా విజయం సాధించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. పరాజయం చెందింది కాబట్టి అనేక అంశాలు చర్చకి వస్తాయి. ఒకప్పుడు మెగాస్టార్ సినిమా అంటే మణిశర్మ రెచ్చిపోయి సంగీతం అందించేవారు. వీరిద్దరి కాంబినేషన్ లో చూడాలని ఉంది, ఇంద్ర, ఠాగూర్, బావగారు బాగున్నారా లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. 

దీనితో ఆచార్య చిత్రానికి కూడా మణిశర్మ అదిరిపోయే మ్యూజిక్ ఇస్తారని ఫ్యాన్స్ ఆశించారు. కానీ సినిమాలో సంగీతం ఉసూరుమనిపించింది. అయితే తాజాగా మణిశర్మ ఓ ఇంటర్వ్యూలో ఆచార్య మ్యూజిక్ విషయంలో కొరటాల శివని బ్లేమ్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. 

కోటి, కీరవాణి సమయం నుంచి చిరంజీవి చిత్రాలకు పనిచేస్తున్నా. ఆయనకి ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు. ఆచార్య బిజియం కోసం నేను ఒక వర్షన్ కొట్టాను. కానీ కొరటాల శివ.. మీరు అనుకుంటున్నట్లుగా వద్దు.. మరో వర్షన్ ఇవ్వండి అని అడిగారు. 

దీనితో ప్రయోగం చేసి కొత్త వర్షన్ చేశాం. అది బెడిసికొట్టింది అంటూ మణిశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా మణిశర్మ చివరగా సమంత యశోద చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రంలో బిజియం బావుందంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. 

click me!