`బాబా` రీ-రిలీజ్‌.. ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్‌ యాడ్‌ చేస్తున్న రజనీకాంత్.. స్ట్రెయిట్‌ సినిమా రేంజ్‌ రిలీజ్‌

First Published Nov 29, 2022, 4:23 PM IST

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన `బాబా` చిత్రాన్ని రీ రిలీజ్‌ చేస్తున్నారు. రజనీ బర్త్ డే స్పెషల్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయబోతున్నారు. అయితే ఇందులో కొంత సర్‌ప్రైజ్‌ యాడ్‌ చేస్తుండటం విశేషం. 
 

రజనీకాంత్‌ (Rajinikanth) హీరోగా సురేష్‌ క్రిష్ణ దర్శకత్వంలో వచ్చిన `బాబా` (Baba) చిత్రం రజనీ కెరీర్‌లో ఓ ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. మనిషా కొయిరాలా కథానాయికగా నటించిన ఈచిత్రానికి తనే కథ అందించి మాటలు, స్క్రీన్‌ప్లే అందించారు రజనీ. అంతేకాదు స్వయంగా నిర్మించారు. 2022లో విడుదలైన ఈ సినిమా పరాజయం చెందింది. `నరసింహా` వంటి హిట్‌ చిత్రం తర్వాత వస్తోన్న సినిమా కావఢంతో భారీ అంచనాల మధ్య రిలీజ్‌ చేశారు. కానీ బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్ చేసింది.

తాజాగా `బాబా` (Baba Re Release) సినిమా మరోసారి తెరపైకి రాబోతుంది. ఈ చిత్రాన్ని రీ రిలీజ్‌ చేస్తున్నారు. రజనీకాంత్‌ బర్త్ డే సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్‌ చేయబోతున్నారు. ఇటీవల రీ రిలీజ్ ట్రెండ్‌ ఊపందుకున్న నేపథ్యంలో `బాబా`ని మరోసారి థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. 

ఇదిలా ఉంటే ఇందులో కొన్ని కొత్త సీన్లు యాడ్‌ చేయబోతున్నారు. నేటి ట్రెండ్‌కి తగ్గట్టు కొన్ని సీన్లు జోడించారట. వాటికి రజనీకాంత్‌ డబ్బింగ్‌ కూడా చెప్పడం విశేషం. వాటిని ఎంతో డెడికేషన్‌తో డబ్బింగ్‌ చెప్పడం మరో విశేషం. అలాగే కొంత ట్రిమ్‌ చేస్తున్నారట. అదే సమయంలో మ్యూజిక్‌ పరంగానూ ఫైన్‌ ట్యూన్‌ యాడ్‌ చేస్తున్నారట ఏ ఆర్‌ రెహ్మాన్‌. స్ట్రెయిట్‌ సినిమా రేంజ్‌లో దీన్ని రిలీజ్‌ చేయబోతున్నారట. 
 

ఇండియా వైడ్‌గా, ఓవరీస్‌లోనూ `బాబా`ని భారీగా రిలీజ్‌ చేసేందుకు నిర్వహకులు ప్లాన్‌ చేస్తున్నారు. ట్రైలర్స్, ప్రోమో వీడియోలు కూడా ప్లాన్‌ చేశారట. అంతేకాదు త్వరలోనే ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా షురూ చేయబోతున్నారని టాక్‌. సినిమాపై భారీ హైప్‌ పెంచబోతున్నారు. ఆ టైమ్‌లో డిజప్పాయింట్‌ చేయడంతో ఇప్పుడైనా ప్రశంసలు పొందేలా చేయాలని ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం. డిసెంబర్‌ 12న రజనీకాంత్‌ పుట్టిన రోజు. అదే రోజు ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్‌ చేయనున్నారని సమాచారం. 
 

ఇక 2002, ఆగస్ట్ 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేశారు. అప్పట్లో ఇది డిజప్పాయింట్‌ చేసింది. పలు విమర్శలు ఎదుర్కొంది. మొదటి భాగంలో అసలు కథే లేదని, చాలా స్లోగా ఉందని అన్నారు. మరోవైపు రజనీ రాజకీయ ఎంట్రీకి వాడుకోబోతున్నారా? అనే విమర్శలు వచ్చాయి. ఇందులో రజనీకాంత్‌ పొగతాగడం, బీడీలు వరుసబెట్టి తాగుతూ పోజులివ్వడం పట్ల తీవ్రమైన విమర్శలు వచ్చాయి. రాజకీయ వర్గాలు సైతం దీన్ని విమర్శించాయి. సినిమాలో దూమపానం, మద్యపానానికి అధిక ప్రాధాన్యతనిచ్చారంటూ కామెంట్లు వచ్చాయి. అంతేకాదు కొన్ని చోట్లు సినిమా రీల్స్ ని కూడా తగులబెట్టారు.

 ఈ సినిమాపై వచ్చిన విమర్శల నేపథ్యంలో రజనీకాంత్‌ సినిమాలకు దూరమయ్యారు. దాదాపు మూడేళ్లపాటు ఆయన సినిమాలు చేయలేదు. ఆ తర్వాత దర్శకులు, నిర్మాతల ఒత్తిడి మేరకు మనసు మార్చుకుని మళ్లీ సినిమాలు చేశారు. `చంద్రముఖి`తో సంచలన విజయాన్ని అందుకున్నారు. ఆతర్వాత `శివాజీ` మరో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రజనీ `జైలర్‌` చిత్రంలో నటిస్తున్నారు. దీనికి నెల్సన్‌ దిలీప్‌ కుమార్ దర్శకుడు. 

click me!