మహేష్ బాబు మూవీ ఫ్లాప్ అని అందరిలో భయం..ఆయనొక్కడే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ముందుగానే

First Published | Oct 17, 2024, 8:34 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అయితే మహేష్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించిన చిత్రాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఒక్కడు, పోకిరి, దూకుడు లాంటి చిత్రాలు ఉన్నాయి. 

సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అయితే మహేష్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించిన చిత్రాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఒక్కడు, పోకిరి, దూకుడు లాంటి చిత్రాలు ఉన్నాయి. రిలీజ్ కి ముందు ఒక చిత్రం విజయం సాధిస్తుందని 100 శాతం కాన్ఫిడెంట్ గా చెప్పడం చాలా కష్టం. ఏ సినిమా ఎప్పుడు బోల్తా కొడుతుందో తెలియదు. 

Mahesh Babu

మహేష్ బాబుకి మణిశర్మ ఫేవరైట్ మ్యూజిక్ డైరెక్టర్. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక్కడు, పోకిరి, ఖలేజా లాంటి చిత్రాలు వచ్చాయి. పోకిరి చిత్రానికి ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పోకిరి చిత్రం కథగా కంటే మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ వల్ల ఎక్కువగా విజయం సాధించింది. హీరో క్యారెక్టరైజేషన్, హీరోయిన్ ఇలియానా, క్లైమాక్స్ ట్విస్ట్ లాంటి అంశాలు ఈ చిత్రాన్ని ఘనవిజయం చేసాయి. 


Mahesh Babu

అయితే ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ తో పాటు చాలా మంది పోకిరి చిత్రం ఫ్లాప్ అని పూరి జగన్నాధ్ కి రిలీజ్ కి ముందే ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. దీనితో సినిమా హిట్ అవుతుందా లేదా అనే టెన్షన్ ప్రతి ఒక్కరిలో ఉంది. కానీ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన మణిశర్మ మాత్రం పూరి కథ చెప్పినప్పుడే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అని గ్రహించారట. 

పూరి కథ చెప్పగానే మణిశర్మ.. రెమ్యునరేషన్ తో పాటు చెన్నై ఏరియా థియేట్రికల్  కావాలని అడిగారట. దీనికి పూరి జగన్నాధ్ అంగీకరించారు. మణిశర్మ ఆశించినట్లుగానే పోకిరి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మహేష్ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచి రికార్డులు నెలకొల్పింది. 

పోకిరి చిత్రంతో మణిశర్మ జాక్ పాట్ కొట్టారు. ఆయన మ్యూజిక్ కి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ రావడమే కాదు.. చెన్నై ఏరియాలో ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించి లాభాలు తెచ్చిపెట్టింది. కథల్ని అంచనా వేయడంలో ఆయన అనుభవం పోకిరి చిత్రంతో ఉపయోగపడింది. 

Latest Videos

click me!