అనుష్కని ఆ పేరుతో పిలిచి ఎగతాళి, అది స్వీటికి దక్కిన అదృష్టం.. అనుష్క పేరు వెనుక క్రేజీ స్టోరీ

First Published | Oct 16, 2024, 11:13 PM IST

అనుష్క ని చాలా వరకు స్వీటీ అని పిలుస్తుంటారు. కానీ ఆమె అసలు పేరుకి సంబంధించిన ఓ విషయం బయటకు వచ్చింది. అందరు అనుకునేది కాదు, ఇందులో మరో ట్విస్ట్ ఉంది. 
 

అనుష్క శెట్టిని తెలుగు ఆడియెన్స్ మాత్రమే కాదు, సినిమా వర్గాలు సైతం స్వీటి అని పిలుస్తుంటారు. అనుష్క శెట్టిగా పాపులర్‌ అయిన ఆమె ఇప్పటికీ అదే జోరు చూపిస్తుంది. అయితే ఇటీవల చాలా సెలక్టీవ్‌గా వెళ్తుంది. బలమైన కంటెంట్‌ ఉన్న సినిమాలు తన పాత్రకి ప్రయారిటీ ఉన్న సినిమాలే చేస్తుంది. అయితే ఇప్పుడు అనుష్క కమర్షియల్‌ హీరోయిన్‌ కాదు, ఆమె లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకే కేరాఫ్‌గా నిలుస్తుంది. హీరోలకు దీటుగా ఆమె సినిమాలు థియేటర్లలో ఆదరణ పొందుతుండటం విశేషం. దీంతో లేడీ సూపర్‌ స్టార్‌ గా ఆమెని అభివర్ణిస్తున్నారు. 

అనుష్క ఇటీవల సినిమాలు తగ్గించింది. ఆమె అధిక బరువు సమస్య కారణంగా చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా చేస్తుంది అనుష్క. అయితే ఆమెకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అనుష్క పేరుకి సంబంధించిన ప్రస్తావన తరచూ వస్తూనే ఉంటుంది. ఆమె అసలు పేరు అనుష్క కాదనే విషయం తెలిసిందే. అసలు పేరు కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే పేరు మార్చుకోవడం వెనుక స్టోరీ చాలా క్రేజీగా ఉండటం విశేషం. ఈ విషయాన్ని అనుష్క స్వయంగా వెల్లడించింది. 
 


అనుష్క ముద్దు పేరు స్వీటి అని అంతా అనుకుంటారు. ముద్దుగా ఇండస్ట్రీజనాలు పెట్టిన పేరుగా చాలా మంది భావిస్తారు. కానీ ఇందులో ఓ షాకింగ్‌ ట్విస్ట్ వెల్లడించింది అనుష్క. స్వీటీ అనేది తన ఒరిజినల్‌ నేమ్‌ అట. చిన్నప్పుడు తమ పేరెంట్స్ పెట్టిన పేరు అది అని చెప్పింది అనుష్క. అయితే ఆ పేరుని చాలా మంది ఎగతాళిగా పిలిచేవాళ్లని, చాలా మంది ఆటపట్టించేవాళ్లట. దీంతో తానే స్వీటీ అని పిలుస్తుంటే చాలా ఎంబారిసింగ్‌ గా ఫీలయ్యిందట. తన పేరు ఏంటి ఇలా ఉందని బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయట. ఇంటర్మీడియట్‌ వరకు కూడా ఇదే పేరు కంటిన్యూ అయ్యిందని తెలిపింది అనుష్క. అయితే ఆ సమయంలోనే చాలా మంది ఇలా స్వీటి అని సెటైరికల్‌గా పిలుస్తూ ఏడిపించే వాళ్లని, దీంతో తాను చాలా బాధపడ్డానని తెలిపింది. తన పేరుని అలా పిలవడానికి కూడా ఇష్టపడేదాన్ని కాదని చెప్పింది అనుష్క. 
 

అయితే ఆ పేరుని మార్చాలని చాలాసార్లు అనుకున్నారట, కానీ కుదరలేదు. ఈ నేపథ్యంలో సినిమాల్లోకి వచ్చాక ఆ పేరుని మార్చుకునే అవకాశం దక్కిందని చెప్పింది అనుష్క. `సూపర్‌` సినిమాకి హీరోయిన్‌గా ఎంపిక చేసినప్పుడు తన పేరు విని చాలా ఆశ్చర్యపోయారట. పూరీ జగన్నాథ్‌, నాగార్జున ఆశ్చర్యంగా చూశారట. సినిమాల్లో పేరుగా ఇది సెట్ కాదని చెప్పారట. పేరు మార్చుకోవాలని తెలిపారట.ఈ పరిస్థితిని ఇంట్లో చర్చించింది అనుష్క. దీంతో వాళ్లు రియాక్ట్ అవుతూ, ఇలా తన పేరుని తానే పెట్టుకునే అవకాశం, అదృష్టం ఎవరికీ రాదు, నీకు వచ్చింది, అది గొప్ప అదృష్టంగా భావించి కొత్త పేరు పెట్టుకో అని తెలిపారట.  దీంతో సడెన్‌గా అనుష్క శెట్టి అనే పేరు తట్టడంతో అదే పేరు పెట్టుకుందట. మరో రెండు మూడు నెలల్లో మరో మంచి పేరు పెట్టుకుందాం లే అనుకుందట అనుష్క. కానీ అదే బాగుండటంతో దాన్ని కంటిన్యూ చేసింది. 
 

అనుష్క అంటే స్టార్‌ అనే అర్థం వస్తుందని చెప్పింది. అయితే ఆ పేరు పెట్టుకునే సమయంలో ఇవన్నీ ఆలోచించలేదని చెప్పింది అనుష్క. అలా తన పేరుని తానే పెట్టుకుంది అనుష్క. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కొత్తలో గ్లామర్‌ పాత్రలతో అలరించిన అనుష్క ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల వైపు టర్న్ తీసుకుంది. `అరుంధతి` దానికిపునాది వేసింది. అది అప్పట్లో సంచలన విజయం సాధించింది. దీంతో అనుష్కకి సోలోగా మంచి మార్కెట్‌ ఏర్పడింది. అదే సమయంలో స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ బిల్డ్ అయ్యింది. `రుద్రమదేవి`, `బాహుబలి`, `భాగమతి` వంటి సినిమాలతో తానేంటో చూపించింది. ఇప్పుడు ఆమె క్రిష్‌ దర్శకత్వంలో `ఘాటి` అనే సినిమాలో నటిస్తుంది. ఇది ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. దీంతోపాటు మలయాళంలో ఓ సినిమా చేస్తుంది అనుష్క. 

Latest Videos

click me!