కూల్ డ్రింక్ లో వోడ్కా కలుపుకుని తాగమని మా అమ్మే ఎంకరేజ్ చేసింది.. నాగార్జున హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

Published : Jul 07, 2024, 06:05 PM IST

90వ దశకంలో పాపులర్ అయిన హీరోయిన్లలో మనీషా కొయిరాల ఒకరు. అప్పట్లో ఈ నేపాలీ బ్యూటీ యువతలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. బాలీవుడ్, కోలీవుడ్ తో పాటు మనీషా కొయిరాల తెలుగులో కూడా నటించింది.

PREV
16
కూల్ డ్రింక్ లో వోడ్కా కలుపుకుని తాగమని మా అమ్మే ఎంకరేజ్ చేసింది.. నాగార్జున హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

చాలా మంది హీరోయిన్లు మద్యం సేవిస్తారు. మద్యం సేవించడం వల్ల కొన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయనేది వాళ్ళ అభిప్రాయం. అదే విధంగా సినీ కల్చర్ లో మద్యం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. పార్టీల్లో, పబ్బుల్లో హీరోయిన్లు హీరోలు మద్యం సేవిస్తారనేది బహిరంగ రహస్యం. బాలీవుడ్ లో ఈ కల్చర్ ఎప్పటి నుంచో ఉంది. 

26

90వ దశకంలో పాపులర్ అయిన హీరోయిన్లలో మనీషా కొయిరాల ఒకరు. అప్పట్లో ఈ నేపాలీ బ్యూటీ యువతలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. బాలీవుడ్, కోలీవుడ్ తో పాటు మనీషా కొయిరాల తెలుగులో కూడా నటించింది. ఒకే ఒక్కడు చిత్రంలో మనీషా కొయిరాల హోమ్లీగా కనిపించింది. 

36

అదే విధంగా నాగార్జున క్రిమినల్ చిత్రంలో మనీషా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. మనీషా కోయిరాల వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. క్యాన్సర్ కారణంగా చావు అంచుల వరకు వెళ్లి కోలుకుంది. వివాహం చేసుకున్నా ఆ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. తక్కువ సమయంలోనే భర్త నుంచి విడిపోయింది. 

46

ఇటీవల ఇంటర్వ్యూలో మనీషా కొయిరాల చిత్ర పరిశ్రమలో లవ్ ఎఫైర్స్, రిలేషన్స్ గురించి ఓపెన్ గా కామెంట్స్ చేసింది. తాను ముక్కుసూటిగా మాట్లేడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని అని తెలిపింది. దీనివల్ల తాను చాలా సమస్యలు ఎదుర్కొన్నట్లు పేర్కొంది. కానీ నా అలవాటును నేను మార్చుకోను అని తెలిపింది. 

56

కెరీర్ బిగినింగ్ లో నేను కూల్ డ్రింక్ లో వోడ్కా కలుపుకుని తాగేదాన్ని. ఎవరైనా అడిగితే కూల్ డ్రింక్ అని అబద్దం చెప్పేదాన్ని. మా అమ్మకి తెలుసు నేను వోడ్కా తాగుతున్నానని. దీనితో ఒకరోజు ఆమె.. నువ్వు వోడ్కా తాగితే ధైర్యంగా ఆ విషయాన్ని బయటకి చెప్పు. అందులో తప్పు లేదు. కానీ కూల్ డ్రింక్ అని అబద్దం చెప్పడమే తప్పు అని నన్ను ఎంకరేజ్ చేసినట్లు మనిషా సంచలన వ్యాఖ్యలు చేసింది. 

66

నాకు తాగుడు అలవాటు ఉంది.అప్పట్లో బాయ్ ఫ్రెండ్స్ తో కూడా తిరిగాను. సంబంధాలు పెట్టుకున్నా. కానీ వీటివల్ల నా కెరీర్ ని ఎప్పుడూ పాడు చేసుకోలేదు. అవి నా పర్సనల్ అని భావించా. అప్పట్లో చాలా మంది హీరోయిన్లకు హీరోలతో శారీరక సంబంధం ఉండేది. కానీ పైకి మాత్రం మమ్మల్ని ఇంతవరకు ఎవరూ టచ్ కూడా చేయలేదు అంటూ అబద్దాలు చెప్పేవారు అని మనీషా పేర్కొంది. వాళ్ళలా అబద్దం చెప్పడం తనకి తెలియదు అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. 

click me!

Recommended Stories