అక్కను మించిపోయిన `ఊ అంటావా` సింగర్‌.. ఒక్క సాంగ్‌తో పాన్ ఇండియా సింగర్‌ అయిన మంగ్లీ చెల్లి తెరవెనుక స్టోరీ

Published : May 06, 2026, 05:31 PM IST

Indravathi Chauhan: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా, బసినేపల్లె తాండాలో పుట్టిన బంజారా అమ్మాయి సింగర్‌ ఇంద్రవతి మొదట 'బోల్ బేబీ బోల్' అనే రియాలిటీ షోతో కెమెరా ముందుకు వచ్చింది. ఆ తర్వాత 'జాజిమొగులాలి' పాటతో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది.  

PREV
17
ఒకే ఒక్క పాటతో ఇంద్రవతికి గుర్తింపు

సినిమా రంగంలో 'లక్' ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పలేం. కొందరు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో ఉన్నా రాని పేరు, గుర్తింపు, మరికొందరికి ఒకే ఒక్క పాటతో వచ్చేస్తుంది. దీనికి బెస్ట్ ఉదాహరణ 'ఊ అంటావా మావ' ఫేమ్ గాయని ఇంద్రవతి చౌహాన్. పాపులర్ సింగర్ మంగ్లీ చెల్లెలుగా కెరీర్ మొదలుపెట్టిన ఈమె, ఇప్పుడు తనకంటూ ఓ ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకుంది.

27
ఇంద్రవతి సోషల్ మీడియాలో రచ్చ
ఇంద్రవతి చౌహాన్ కేవలం మైక్ పట్టుకుని పాడే సింగర్ మాత్రమే కాదు, ఇన్‌స్టాగ్రామ్ లాంటి ప్లాట్‌ఫామ్‌లలో మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్న డిజిటల్ స్టార్ కూడా. తన గ్లామరస్ ఫొటోషూట్‌లు, జానపద స్టైల్ వీడియోలతో అభిమానుల మనసు దోచుకుంటుంది. జానపద సంగీతాన్ని కూడా యూత్‌కు నచ్చేలా ఎలా అందించవచ్చో ఇంద్రవతి నిరూపించింది.
37
ఊ అంటావా పాటతో పాపులర్‌ అయిన ఇంద్రవతి

సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ 'పుష్ప' సినిమాలోని 'ఊ అంటావా మావ' పాట కోసం ఓ కొత్త వాయిస్ వెతుకుతున్నప్పుడు ఆయనకు ఇంద్రవతి కనిపించింది. సమంత ఫైర్ లాంటి డ్యాన్స్‌కు ఇంద్రవతి కంచు కంఠం, ఆ 'రా' నెస్ పక్కాగా సరిపోయాయి. పాట రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ట్రెండ్‌ అయ్యింది. ఆ తర్వాత కుర్రాళ్లని ఊపేసింది.

47
అవార్డులందుకున్న ఇంద్రవతి

ఈ పాట కోసం 2022లో ఇంద్రవతి 'ఉత్తమ నేపథ్య గాయని'గా పలు  అవార్డులను అందుకుంది. ఎలాంటి శాస్త్రీయ సంగీత శిక్షణ లేకపోయినా, ఆమె గొంతులో ఉన్న సహజమైన బలం వినేవారిని అలరింప చేసింది.  

57
ఇంద్రవతి స్వస్థలం
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా బసినేపల్లె తాండాలో పుట్టిన ఈ బంజారా (లంబాడీ) అమ్మాయి, చిన్నప్పటి నుంచే కళల మధ్య పెరిగింది. మొదట 'బోల్ బేబీ బోల్' రియాలిటీ షోతో కెమెరా ముందుకు వచ్చింది. ఆ తర్వాత 'జార్జ్ రెడ్డి' సినిమాలోని 'జాజిమొగులాలి' పాటతో సినీ రంగ ప్రవేశం చేసింది. అక్క మంగ్లీ ప్రోత్సాహం, తన కఠోర శ్రమ ఆమెను పాన్ ఇండియా స్థాయికి చేర్చాయి.
67
ఇంద్రవతి గాయనే కాదు, డాన్సర్‌ కూడా
1996 మార్చి 5న జన్మించిన ఇంద్రవతి, తన మూలాలను ఎప్పుడూ మర్చిపోలేదు. తన కమ్యూనిటీ సంప్రదాయ పాటలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో ఈమె కీలక పాత్ర పోషిస్తోంది. భారతీయ విద్యాభవన్‌లో చదువుకున్న ఈమె, ఇప్పుడు కేవలం గాయనే కాదు, అద్భుతమైన డ్యాన్సర్ కూడా.
77
ఇంద్రవతి మోస్ట్ వాంటెడ్‌ సింగర్‌

అక్క మంగ్లీ జానపద లోకాన్ని దున్నేస్తుంటే, చెల్లెలు ఇంద్రవతి సినిమా ప్రపంచంలో మోస్ట్ వాంటెడ్ సింగర్. మొత్తానికి ఈ అక్కాచెల్లెళ్లిద్దరూ సౌత్ ఇండియా సంగీత ప్రపంచాన్ని ఏలుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అక్క ఇటీవల ఒక స్కామ్‌లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories