చిరంజీవితో పాటు కెరీర్ ప్రారంభించిన ఓ నటుడు ప్రారంభంలో వరుస హిట్లు అందుకున్నారు. కానీ చివరికి అతడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయారు. ఆ నటుడు ఎవరో ఈ కథనంలో తెలుసుకోండి.
చిరంజీవి 70వ దశకం చివర్లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తల్లో చిరంజీవి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తన ట్యాలెంట్ కి గుర్తింపు లభించే వరకు చిరంజీవి చిన్న వేషాలు వేయాల్సి వచ్చింది. విలన్ గా కూడా నటించారు. అయితే చిరంజీవితో పాటు ఇండస్ట్రీలోకి వచ్చిన మరో నటుడు శివ కృష్ణ మాత్రం వరుస హిట్లతో దూసుకుపోయారు.
25
చిరంజీవి కంటే అతడికే ఎక్కువ హిట్లు
ప్రారంభంలోనే శివ కృష్ణకి హీరోగా అవకాశాలు వచ్చాయి. ఓ ఇంటర్వ్యూలో శివ కృష్ణ మాట్లాడుతూ.. కెరీర్ బిగినింగ్ లో చిరంజీవి కంటే నాకే హిట్లు ఎక్కువ వచ్చాయి. ఇది వాస్తవం. కానీ ఆ తర్వాత నేను ఒక రకమైన పాత్రలకు పరిమితం అయ్యాను. చిరంజీవి మాత్రం తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ దూసుకుపోయారు.
35
అందుకే చిరంజీవి నెంబర్ 1
నా కెరీర్ లో నేను ఏ నిర్మాత ఇంటికి వెళ్లి సినిమా అవకాశం ఇవ్వమని అడగలేదు. అదే విధంగా అన్ని పాత్రలని నేను అంగీకరించలేదు. నటుడిగా ఉన్నప్పుడు అన్ని పాత్రల్లో నటించాలి. నేను చేసిన పొరపాటు చిరంజీవి చేయలేదు, అందుకే టాలీవుడ్ లో నెంబర్ 1 హీరో అయ్యాడు అని శివ కృష్ణ అన్నారు.
కమర్షియల్ సినిమాలు చేయాలనే ఆలోచన నాకు చాలా ఆలస్యంగా కలిగింది. నేను చేసిన కమర్షియల్ సినిమాల్లో డూప్ లేకుండా ఫైట్స్ చేసాను. ఆ సెంటిమెంట్ సినిమాలు కూడా చేశాను అని శివ కృష్ణ అన్నారు.
55
ఇండస్ట్రీకి అవసరమయ్యే సినిమాలు
ఇండస్ట్రీకి చిరంజీవి లాంటి వారే కరెక్ట్. ఇండస్ట్రీకి ఎలాంటి సినిమాలు అవసరమో చిరంజీవి అలంటి సినిమాలు చేశారు. నాకు కెరీర్ బిగినింగ్ లో చిరంజీవి కంటే ఎక్కువ హిట్స్ ఉన్నప్పటికీ ఆ తర్వాత ఇండస్ట్రీకి అవసరమయ్యే సినిమాలు చేయలేకపోయాను అని శివ కృష్ణ తెలిపారు. హీరోగా అవకాశాలు ముగిశాక శివ కృష్ణ టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యారు.