నల్లగా ఉందని రెండు నెలలు పసుపు రాశారు.. కట్‌ చేస్తే ఇండస్ట్రీని దున్నేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?

Published : May 06, 2026, 04:40 PM IST

తెలుగులో ఓ స్టార్‌ హీరోయిన్‌ నల్లగా ఉందని కెరీర్‌ బిగినింగ్‌లో చాలా అవమానాలు ఫేస్‌ చేసిందట. తన మొదటి సినిమా కోసం ఏకంగా రెండు నెలలు పసుపు రాసుకుందట.  కట్‌ చేస్తే ఆమె ఆ తర్వాత టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది.  

PREV
14
నల్లగా ఉందని రిజెక్ట్ చేశారు

సినిమా అంటే గ్లామర్‌ ప్రపంచం. ఇక్కడ అందంగా ఉన్న అమ్మాయిలకే లైఫ్‌ ఉంటుంది. ఫెయిర్‌గా ఉండి అన్నీ బాగున్న అమ్మాయిలకే అవకాశాలు రావడం కష్టం. డస్కీగా, నల్లగా ఉంటే ఎవరూ పట్టించుకోరు. కానీ ఓ హీరోయిన్‌ విషయంలో మాత్రం అందుకు రివర్స్ జరిగింది. నల్లగా ఉందని కొందరు రిజెక్ట్ చేశారు, మరి కొందరు ఆమె హీరోయిన్‌ ఏంటి? అన్నారు. హీరోయిన్‌గా పనికిరాదు, వద్దు అని చెప్పారు. కానీ దర్శకుడు నమ్మాడు. ఆమెనే హీరోయిన్‌గా పెట్టి సినిమా తీశాడు. సూపర్‌ స్టార్‌ కొట్టాడు. అయితే ఆ హీరోయిన్‌లో నలుపు పోవడానికి రెండు నెలలు పసుపు రాశారట. ఆ కథేంటో చూస్తే. 

24
భానుప్రియని రిజెక్ట్ చేసిన సినిమాటోగ్రాఫర్‌

నల్లగా ఉన్నా, హీరోయిన్‌గా సక్సెస్‌ అయిన నటి భానుప్రియ. ఆమె `సితార` మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఓ తమిళ సినిమాలో చూసి దర్శకుడు వంశీ `సితార` సినిమా కోసం ఆమెని హీరోయిన్‌గా ఎంపిక చేశాడు. అయితే ఆమెని చూసి కెమెరామెన్ వద్దు అన్నాడట. మన సినిమాకి సెట్‌ కాదని మొహం మీదే చెప్పారట. సినిమాలోని  కోకిల పాత్ర ప్యాలెస్‌లో ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. ఆ పాత్రకి ఇలాంటి నల్లగా ఉన్న అమ్మాయిని పెడితే జనం రిసీవ్‌ చేసుకోలేరు. అందులోనూ అన్న పాత్ర శరత్‌కుమార్‌ చేశారు. ఆయన చాలా వైట్‌గా ఉంటాడు. అలాంటి వ్యక్తి చెల్లి అంటే అంతే ఫెయిర్‌ గా ఉండాలి. లేదంటే వేరే అర్థాలువస్తాయని దర్శకుడికి చెప్పాడట కెమెరామెన్‌.

34
రెండు నెలలు పసుపు రాశారట

`సితార`లో కోకిల పాత్రకి భానుప్రియ సెట్‌ కాదని ఆ మూవీ సినిమాటోగ్రాఫర్‌ రఘు చెప్పాడట. కానీ దర్శకుడు వంశీ వినలేదు. ఆయనకు స్వతహాగా నలుపు అంటే ఇష్టం. అమ్మాయిల విషయంలోనూ అదే పాటించాడు. ఈ మూవీలో భానుప్రియని పట్టుబట్టి హీరోయిన్‌గా తీసుకున్నారట. అయితే పాత్రకి న్యాయం చేయడం కోసం రెండు నెలలు పసుపు రాశారట. రోజంతా పసుపు రాసుకొని ఉండాలని, తర్వాత నీట్‌ గా కడుక్కోవడం, ఇలా రెండు నెలలు చేశారట. ఆ తర్వాత ఆ నలుపు ఛాయలు పోయాయని, అంతేకాదు, ఆ తర్వాత మేకప్‌ వేసి ఒక లుక్‌ని సెట్‌ చేశారట. ఇకపై సినిమా షూటింగ్‌ జరుగుతున్నన్ని రోజులు ఇదే లుక్‌ని ఫాలో కావాలని తెలిపారట. అలా ఒక లుక్‌ డిజైన్‌ చేసి, దాన్నే సినిమా మొత్తం ఫాలో అయ్యారట. దీంతో భానుప్రియ లుక్కే మారిపోయింది.

44
ఇండస్ట్రీని దున్నేసిన భాను ప్రియ

అలా చేయడం వల్ల సినిమాలో భానుప్రియ అంత అందంగా వచ్చిందని తెలిపారు కెమెరామెన్‌ రఘు. ఆయన లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా విషయంలోనే కాదు, భానుప్రియా చాలా సందర్భాల్లో ఆమె ఇలాంటి అవమానాలు, కామెంట్స్ ఫేస్‌ చేసిందట. కానీ ఆ తర్వాత ఆమె లైఫే మారిపోయింది. `సితార` హిట్‌ తో పెద్ద స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళంలో స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. దర్శకుడు వంశీ.. ఆమెని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ తల్లి నో చెప్పడంతో అది కుదరలేదు.  ఆ తర్వాత భానుప్రియ ఆదర్శ్ కౌశల్‌ ని వివాహం చేసుకుంది. వీరికి కూతురు ఉన్నారు. 2018లో ఆయన కన్నుమూశారు. ఆ తర్వాత ఒంటరైపోయింది భానుప్రియ. ప్రస్తుతం ఆమె మతిమరుపుతో బాధపడుతుందట.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories