మంచు ఫ్యామిలీపై ట్రోల్స్ వెనకాల స్టార్‌ హీరో కుట్ర.. మంచు విష్ణు సంచలన ఆరోపణ.. పేలుతున్న సెటైర్లు

Published : Sep 27, 2022, 07:49 PM IST

తనపై వస్తోన్న ట్రోల్స్ వెనకాల, తన ఫ్యామిలీని హెరాస్‌ చేయడం వెనకాలు ఓ ప్రముఖ హీరో ఉన్నాడంటూ షాకింగ్‌ కామెంట్‌ చేశారు మంచు విష్ణు. అంతేకాదు ఆ హీరో వివరాలు వెల్లడిస్తూ షాకిచ్చాడు.   

PREV
17
మంచు ఫ్యామిలీపై ట్రోల్స్ వెనకాల స్టార్‌ హీరో కుట్ర.. మంచు విష్ణు సంచలన ఆరోపణ.. పేలుతున్న సెటైర్లు

మంచు విష్ణు తాజాగా సంచలన కామెంట్లు చేశారు. `జిన్నా` సినిమా రిలీడ్‌ డేట్‌ ప్రకటిస్తూ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో షాకింగ్ విషయాలను బయటపెట్టాడు. తనపై వస్తోన్న ట్రోల్స్ వెనకాల ప్రముఖ స్టార్‌ హీరో ఉన్నాడంటూ దుమారం రేపాడు. అంతేకాదు ఏకంగా సాఫ్ట్ వేర్‌ కంపెనీని నడిపిస్తున్నాడట. తాజాగా  ఆ హీరో వివరాలు రాబట్టినట్టు చెప్పి బాంబ్‌ పేల్చాడు మంచు విష్ణు. 
 

27

ఆయన మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ చెక్‌ పోస్ట్ ఓ ఒక సాఫ్ట్ వేర్‌ కంపెనీలో 21 మంది ఉద్యోగులను నన్ను టార్గెట్‌ చేయడానికి, నా ఫ్యామిలీని హెరాస్‌ చేయడానికి నియమించారు. ఆ ఆఫీస్‌ అడ్రస్‌ ఒక ప్రముఖ నటుడి ఆఫీస్‌, ఐపీ అడ్రస్‌ మాకు లభించాయి. 85శాతం ట్రోల్స్ అక్కడి నుంచే వస్తున్నాయి` అని పేర్కొన్నాడు మంచు విష్ణు. 
 

37

అంతేకాదు 18యూట్యూబ్‌ ఛానెల్‌పై చర్యలు తీసుకోబోతున్నట్టు తెలిపారు. వారిపై గురువారం కోర్ట్ లో కేసు వేయాలనుకున్నట్టు తెలిపారు. ఈ యూట్యూబ్‌ ఛానెల్స్ తమపై,ఇంకొందరు హీరోహీరోయిన్లపై తప్పుడు సమాచారం ప్రసారం చేస్తున్నట్టు, ట్రోల్స్ చేస్తున్నట్టు తెలిపారు మంచు విష్ణు. దీనికోసం ఎంత దూరమైనా వెళ్తామని, ఆ 18 యూట్యూబ్‌ ఛానెళ్లని మూసివేయిస్తామని స్పష్టం చేశారు.
 

47
manchu vishnu

దీంతో ఇప్పుడు మంచు విష్ణు వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఫిల్మ్ నగర్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. మంచు హీరో తన సినిమా రిలీజ్‌ టైమ్‌లో ఇలాంటి కామెంట్లు చేయడం సర్వత్రా చర్చనీయాంశమవుతుంది. మంచు విష్ణుపై ఇలాంటి పని ఎవరు చేస్తారని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అదే సమయంలో దీనిపై కూడా సెటైర్లు పేలుస్తున్నారు. ట్రోల్స్ చేయడానికి నెటిజన్లు చాలా మంది ఉన్నారు, దానికి ప్రత్యేకంగా ఓ ఐటీ కంపెనీని నడిపించే ఆలోచన ఏ హీరో చేశారని ప్రశ్నిస్తున్నారు.

57

మరి మంచు విష్ణు ఆరోపించిన ఆ హీరో ఎవరనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. అయన ఎవరు గెస్ట్ చేయండి అంటూ సోషల్‌ మీడియాలో పోల్స్ కూడా నడుస్తుండటం విశేషం. దీనిపై కూడా కొందరు నెటిజన్లు సెటైర్లు పేలుస్తుంది. కంపెనీ పెట్టి మరీ ఎవర్రా ఇంత పనిచేయడానికి ఒడిగట్టింది? అంటున్నారు. కొంప తీసి `చంద్రహాస్‌` కాదు కదా అంటూ కామెంట్లు చేయడంతో ఇది పెద్ద రచ్చైపోతుంది.

67

సినిమా రిలీజ్‌ కి ఉండటంతో `మా` ఎన్నికల విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారా? నిజంగానే దీని వెనకాలుకుట్ర ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదంతా సినిమా ప్రమోషన్‌ స్టంటా? అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. కానీ ఇప్పుడు మంచు విష్ణు కామెంట్లు సోషల్‌ మీడియాకి వారానికి సరిపడ స్టఫ్‌ ఇచ్చినట్టైందంటున్నారు క్రిటిక్స్. 

77

`మోసగాళ్లు` తర్వాత మంచు విష్ణు నటించిన చిత్రం `జిన్నా`. జి. నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వం వహించిన ఈచిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్‌, బాలీవుడ్‌ శృంగార తార సన్నీలియోన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్‌ 5న విడుదల కావాల్సి ఉంది. కానీ తాజాగా సినిమాని వాయిదా వేస్తున్నట్టు ప్రెస్‌మీట్ లో తెలిపారు మంచు విష్ణు. అక్టోబర్‌ 21న రిలీజ్‌ చేయబోతున్నట్టు వెల్లడిచారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories