పెళ్లి ఫోటోలు షేర్‌ చేసిన శ్రియా.. పేరెంట్స్ ని హగ్‌ చేసుకుంటూ ఎమోషనల్.. స్పెషల్‌ ఏంటంటే

Published : Sep 27, 2022, 06:48 PM IST

హాట్‌ హీరోయిన్‌ శ్రియా శరణ్‌ తాజాగా తన మ్యారేజ్‌ ఫోటోలు పంచుకుంటుంది. ఇందులో ఆమె తన పేరెంట్స్ ని హగ్ చేసుకుంటూ కనిపించడం విశేషం. అయితే ఇప్పుడు ఈ ఫోటోలు పంచుకోవడం హాట్‌ టాపిక్ అవుతుంది.

PREV
16
పెళ్లి ఫోటోలు షేర్‌ చేసిన శ్రియా.. పేరెంట్స్ ని హగ్‌ చేసుకుంటూ ఎమోషనల్.. స్పెషల్‌ ఏంటంటే

శ్రియా పదేళ్ల క్రితం టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన విషయం తెలిసిందే. మ్యారేజ్‌ తర్వాత జోరు తగ్గింది. సెలెక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. మరోవైపు తన కూతురుతోనే ఎక్కువ సమయం గడుపుతోంది. ఆయా వీడియోలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది. 
 

26

ఇదిలా ఉంటే శ్రియా తన వెడ్డింగ్‌ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేసింది. రష్యాకి చెందిన టెన్నిస్‌ ప్లేయర్‌ ఆండ్య్రూ కొశ్చీవ్‌ ని రహస్యంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2018 శ్రియా వివాహం జరిగింది. ఆ సమయంలో రెండు మూడు ఫోటోలను మాత్రమే పంచుకుంది. అవి వైరల్‌ అయ్యాయి. ఇప్పుడు మరికొన్ని పిక్స్ ని షేర్‌ చేసింది. 

36

ఇందులో పెళ్లికూతురుగా ఉన్న శ్రియా ప్రధానంగా తన అమ్మా నాన్నల నీరజా శరణ్‌, పుష్పేంద్ర శరణ్‌లతో దిగిన ఫోటోలను షేర్‌ చేసింది. సోమవారం వీరిద్దరి పుట్టిన రోజు. ఇద్దరివి ఒకే రోజు బర్త్ డే కావడం విశేషంగా చెప్పొచ్చు. అమ్మానాన్నలకు బర్త్ డే విషెస్‌ చెబుతూ, మ్యారేజ్‌ టైమ్‌లో వారితో దిగిన ఫోటోలను షేర్‌ చేసింది శ్రియా. మీరు బెస్టియెస్ట్ పేరెంట్స్ అంటూ ఎమోషనల్‌ పోస్ట్ చేసింది శ్రియా. 
 

46

`ఇష్టం` సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది శ్రియా శరణ్‌. `సంతోషం`, `నువ్వే నువ్వే`, `ఠాగూర్`, `నేనున్నాను`, `అర్జున్‌`, `బాలు`, `నా అల్లుడు`, `శుభాష్‌ చంద్రబోస్‌`, `చత్రపతి`, `భగీరధ`, `శివాజీ`, `డాను శ్రీను`, `పవిత్ర`, `లైప్‌ ఈజ్‌ బ్యూటీఫుల్`, `మనం`, `గోపాల గోపాల`, `గౌతమిపుత్ర శాతకర్ణి`, `పైసా వసూల్‌`, `గాయత్రి` వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. 
 

56

కెరీర్‌ డౌన్‌ అవుతున్న క్రమంలో రష్యా టెన్నిస్‌ స్టార్‌ ఆండ్య్రూ కొశ్చీవ్‌ ప్రేమలో పడింది. 2018 మార్చి 19న వివాహం చేసుకున్నారు. వీరికి గతేడాది జనవరి 10న కూతురు రాధా జన్మించింది. 
 

66

సెకండ్‌ ఇన్నింగ్స్ లోనూ సినిమాలతో బిజీగా ఉంటుంది శ్రియా. ప్రస్తుతం ఆమె హిందీలో అజయ్‌ దేవగన్‌తో `దృశ్యం2`, కన్నడలో ఉపేంద్రతో `కబ్జా` చిత్రంలో నటిస్తుంది. అలాగే `మ్యూజిక్‌ స్కూల్‌`సినిమా చేస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories