మా ప్రెసిడెంట్, హీరో మంచు విష్ణు ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'గాలి నాగేశ్వర రావు'. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విష్ణు సరసన హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్, శృంగార తార సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఇషాన్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కోన వెంకట్ ఈ చిత్రానికి రచయిత.