Guppedantha Manasu: రిషీ గుండెను ముక్కలు చేశావ్ వసుధార.. జగతి కన్నీళ్లు.. దేవదాసులా మారిన ఇగో మాస్టర్!

Published : May 31, 2022, 07:22 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 31 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
16
Guppedantha Manasu: రిషీ గుండెను ముక్కలు చేశావ్ వసుధార.. జగతి కన్నీళ్లు.. దేవదాసులా మారిన ఇగో మాస్టర్!

ఈరోజు ఎపిసోడ్ లో జగతి(jagathi),మహేంద్ర లు రిషి గురించి ఆలోచిస్తూ రిషికీ ఏమైందా అని భయపడుతూ ఉంటారు. ఇంతలో ధరణి (Dharani )అక్కడికి వచ్చి చిన్న మామయ్య దేవయాని అత్తయ్య పిలుస్తున్నారు రావాలంటే అని చెబుతుంది. మరొకవైపు రిషి కారులో వస్తూ జరిగిన విషయం గురించి తలచుకొని బాధపడుతూ ఉంటాడు.
 

26

మరొక వైపు దేవయాని(devyani), రిషి విషయం గురించి జగతి,మహేంద్ర లను నిలదీస్తూ ప్రేమ ఉంటే సరిపోదు బాధ్యత ఉండాలి అని అంటుంది.ఇంతలో అప్పుడు జగతి అక్కయ్య మేము బాధపడుతుంటే మీకు సంతోషంగా ఉందా అని అంటుంది. అప్పుడు దేవయాని నువ్వు ఇంట్లోకి వచ్చిన తర్వాతే రిషి(rishi) అదుపు తప్పిపోతున్నాడు అని అనగా అప్పుడు జగతి దేవయానికి స్ట్రాంగ్ బుద్ధి చెబుతుంది. ఇంతలోనే రిషి వస్తాడు.
 

36

రిషిని ఎంతమంది అడిగినా కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా బాధతో వెళ్ళిపోతాడు. మరొకవైపు వసు(vasu) జరిగిన విషయం గురించి తలచుకుని బాధ పడుతూ ఉంటుంది. రిషి కూడా ఇంట్లో బాధపడుతూ ఉండగా అక్కడికి మహేంద్ర వస్తాడు. అప్పుడు వసు ఫోన్ చేసిన కూడా రిషి లిప్ చేయరు. అప్పుడు మహేంద్ర(mahendra) అక్కడికి వచ్చి ఏం జరిగింది అని గుచ్చిగుచ్చి అడుగుతాడు.
 

46

అప్పుడు  ఈ ప్రిన్స్ ని చిన్నప్పుడే తల్లిని వదిలేసి వెళ్ళిపోయింది. సాక్షి(sakshi)మధ్యలో వదిలేసింది. ఇప్పుడేమో అని మాట్లాడకుండా సైలెంట్ గా ఉండి పోవడంతో మహేంద్ర గుచ్చి గుచ్చి ఏం జరిగింది ఇప్పుడు చెప్పు అని అడుగుతాడు. అప్పుడు జగతి(jagathi)వారి మాటలు వింటూ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే వసుధారతో మాట్లాడాల్సిందే అని అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
 

56

ఆ తర్వాత మహేంద్ర(Mahendra)ను రిషి చేయి పట్టుకొని పిలుచుకొని వెళ్తాడు. మరొకవైపు వసు ఒంటరిగా నిలబడి ఎందుకు భయపడాలి అని తనకు తాను ధైర్యం చెప్పుకుంటుంది. మరొక వైపు రిషి, మహేంద్ర లు మందు తాగడానికి బార్ కీ వెళ్తారు. మహేంద్ర ఏమీ అర్థం కాక రిషి (rishi)నీ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. అప్పుడు రిషి మంజు తాగబోతు ఉండగా మహేంద్ర ఫోటోలు తీస్తాడు. అప్పుడు రిషి చేతిలో మందు గ్లాస్ పట్టుకుని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో వసు తనతో మాట్లాడుతున్నట్టుగా ఊహించుకుంటాడు.
 

66

ఆ తర్వాత  రిషి వెళ్దాం పదండి డాడ్ అని అంటాడు. మరొకవైపు జగతి( jagathi), వసు దగ్గరకి వెళ్తుంది. నేను జగతి మేడమ్ లా రాలేదు రిషి కీ తల్లిలా వచ్చాను అని అంటుంది. ఏం జరిగింది అని వసు ని నిలదీస్తుంది జగతి. ఇక రేపటి ఎపిసోడ్ లో వసు, రిషి ప్రేమను ఎందుకు రిజెక్ట్ చేసావు అని నిలదీస్తుంది జగతి. అప్పుడు రిషి(rishi) సార్ ప్రేమిస్తే నేను ప్రేమించాలా మేడమ్ అని అనగా వెంటనే జగతి రిషి గుండెను ముక్కలు చేసావు అని అంటుంది.

click me!

Recommended Stories