మోహన్‌బాబుకి తెలియకుండా చిరంజీవితో ఆ పనిచేస్తున్న మంచు విష్ణు.. తెరవెనుక ఇంత కథ నడిపిస్తున్నాడా?

Published : Mar 24, 2024, 06:14 PM ISTUpdated : Mar 24, 2024, 06:23 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి, కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు మధ్య గ్యాప్‌ ఉందని అంటుంటారు. కానీ తండ్రి మోహన్‌బాబుకి తెలియకుండా మంచు విష్ణు ఆ పని చేస్తున్నాడట.   

PREV
18
మోహన్‌బాబుకి తెలియకుండా చిరంజీవితో ఆ పనిచేస్తున్న మంచు విష్ణు.. తెరవెనుక ఇంత కథ నడిపిస్తున్నాడా?

చిరంజీవికి, మోహన్‌బాబుకి మధ్య విభేదాలు ఉంటాయని, ఇద్దరికి పడదని అంతా అనుకుంటారు. చాలా కాలంగా ఇది వినిపించే మాట. కొన్ని సంఘటనలు కూడా వీటికి బలం చేకూరుస్తుంటాయి. రెండేళ్ల క్రితం `మా` ఎన్నికల సందర్భంలో చోటు చేసుకున్న పరిణామాలే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆ సమయంలో ప్రత్యక్షంగా కాకపోయినా, పరోక్షంగా విమర్శలు చేసుకున్నారు. ఇద్దరికి ఇద్దరు చురకలు అంటించుకున్నారు. 

Survey:వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?
 

28

ఈ విషయంలో చిరంజీవిపై మంచు విష్ణు కూడా ఫైర్‌ అయ్యారు. పేరు చెప్పలేదుగానీ, చిరంజీవిని టార్గెట్‌ చేస్తూ మాట్లాడారు. అప్పట్లో వీరి మధ్య మాటల యుద్ధం అంతా చర్చనీయాంశం అయ్యింది. ఇలా అంతకు ముందు కూడా పలు సందర్భాల్లో విభేదాలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి.  
 

38

చిరంజీవి, మోహన్‌బాబులు తమ మధ్య ఏం లేవని చెప్పేప్రయత్నం చేస్తుంటారు. ఏదైనా అకేషనల్ గా కలుసుకున్నప్పుడు తాము మంచి స్నేహితులమే అనేలా ప్రవర్తిస్తారు. హగ్‌ చేసుకోవడాలు, ముద్దులు పెట్టుకోవడాలు చేస్తూ హంగామా చేస్తుంటారు. అయితే ఈ ఇద్దరి మధ్య రిలేషన్‌ విషయంలో మంచు విష్ణు ఇన్‌వాల్వ్ మెంట్‌ కూడా ఉంటుందట. మోహన్‌బాబుకి తెలియకుండా విష్ణు ఆ పనులు చేస్తుంటాడట. 

48

మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, చిరంజీవితో అనుబంధం, ఆయన తనపై చూపే ప్రేమని వెల్లడించారు. ఇప్పటి వరకు తనకు బెస్ట్ కాంప్లిమెంట్‌ చిరంజీవి నుంచే వచ్చిందట. నటుడిగా తాను నెక్ట్స్ లెవల్‌ వెళ్లే ప్లాన్‌ చేస్తున్నానని, మున్ముందు పాన్‌ ఇండియా దాటి వెళ్లాలనుకుంటున్నట్టు తెలిపారు. అందుకు `మోసగాళ్లు` సినిమా పునాది అవుతుందన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆ సమయంలో చేసింది. 
 

58

కెరీర్‌లో బెస్ట్ కాంప్లిమెంట్‌ గురించి చెబుతూ, తన కెరీర్‌లో చిరంజీవి ఇచ్చిన కాంప్లిమెంట్‌ బెస్ట్ కాంప్లిమెంట్ అని, జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని, కడుపు నిండిపోయిందన్నారు. ఓ రోజు ప్రముఖ పత్రికలో చిరంజీవి.. మంచు విష్ణు ఫోటో చూశాడట. అందులో ఓ బిగ్‌ స్టార్‌ని తలపించేలా విష్ణు ఉన్నాడట. అయితే కృష్ణంరాజు బర్త్ డే సందర్భంగా అందరు ఆయన వద్దకు వెళ్లినప్పుడు చిరంజీవి కూడా అక్కడికి వచ్చారట. 
 

68

పెద్దవాళ్లు అంతా ఒక చోట కూర్చున్నారని, వారి వద్దకు చిరంజీవి వెళ్తున్న సమయంలో మంచు విష్ణు విష్‌ చేశాడట. సడెన్‌గా తనని చూసిన చిరంజీవి.. హే.. పేపర్‌లో నీ ఫోటో చూశాను. చాలా బాగున్నావు, నాకు ... హీరోలా అనిపించావు, ఏంటి ఆ హీరో మన తెలుగు పేపర్‌లో ఉన్నాడేంటి అని ఒక్కసారిగా కన్‌ఫ్యూజ్‌ అయ్యానని, అంత బాగా ఉన్నావని చిరు ప్రశంసించినట్టు తెలిపాడు విష్ణు. దీంతో తాను ఆనందంతో ఉప్పొంగిపోయినట్టు తెలిపారు. ఎందుకంటే  ఆ హీరో తన ఫేవరేట్‌ యాక్టర్‌ అని, చిన్నప్పట్నుంచి ఆయన్ని ఆరాధించే వాడిని అని, ఆయనలా అవ్వాలని కలలు కనేవాడిని అని, సరిగ్గా మెగాస్టార్ ఆయనతోనే పోల్చడంతో ఆనందానికి అవదుల్లేవని తెలిపారు మంచు విష్ణు. ఆ హీరో హృతిక్‌ రోషన్‌గా వెల్లడించారు మంచు విష్ణు. 
 

78

ఈ సందర్భంగా మరో సీక్రెట్‌ని బయటపెట్టాడు. మోహన్‌బాబు, చిరంజీవి మధ్య ఫోన్‌ సందేశాల రహస్యం వెల్లడించాడు. `మా నాన్నకి మెసేజ్‌లు పెట్టడం తెలియదు. వచ్చిన వాటిని చూసుకుంటాడు. ఇప్పుడిప్పుడు వాయిస్‌ మెసేజ్‌లు పంపిస్తుంటాడు. కానీ నేను చనువు తీసుకుని నాన్న ఫోన్‌ నుంచి చిరంజీవి అంకుల్‌కి మెసేజ్‌లు పంపిస్తుంటాను. దానికి ఆయన్నుంచి ప్రాపర్‌గా రిప్లైలు ఉంటాయి, రిలేషన్‌షిప్‌ని బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తుంటాను. ఇది గొప్ప గౌరవంగా భావిస్తాను. చనువు ఇచ్చాడు కదా అని, దాన్ని మిస్‌ యూజ్‌ చేయకుండా కరెక్ట్ గా వాడుతుంటాను` అని తెలిపారు విష్ణు.

88

మంచు విష్ణు ప్రస్తుతం `కన్నప్ప` చిత్రంలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, భారీ కాస్టింగ్‌తో రూపొందిస్తున్న చిత్రమిది. బాలీవుడ్‌ డైరెక్టర్‌ రూపొందిస్తున్నారు. ఇందులో మంచు విష్ణు టైటిల్‌ రోల్‌ చేస్తుండగా, ప్రభాస్‌ గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నారు. అలాగే మోహన్‌లాల్‌, శివరాజ్‌ కుమార్‌, శరత్‌ కుమార్‌, బ్రహ్మానందం వంటి వారు ఎక్స్ టెండెడ్‌ గెస్ట్ రోల్స్ చేస్తున్నారట. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇందులో మోహన్‌బాబు కూడా కనిపించబోతున్నారు. ఆయనే నిర్మాత. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories