తమన్నాతో అప్పుడే డేటింగ్ మొదలైంది... ఓపెన్ అయిన తమన్నా ప్రియుడు విజయ్ వర్మ!

Published : Mar 24, 2024, 05:34 PM IST

నటుడు విజయ్ వర్మతో తమన్నా డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. తమన్నాతో బంధంపై విజయ్ వర్మ తాజాగా మాట్లాడారు. వారి రిలేషన్ ఎలా? ఎప్పుడు? మొదలైందో చెప్పాడు..   

PREV
15
తమన్నాతో అప్పుడే డేటింగ్ మొదలైంది... ఓపెన్ అయిన తమన్నా ప్రియుడు విజయ్ వర్మ!
Tamannah Bhatia


విజయ్ వర్మ-తమన్నా భాటియా ఎఫైర్ పై ఏడాది కాలంగా పుకార్లు వస్తున్నాయి. 2023 న్యూ ఇయర్ వేడుకలు వీరిద్దరూ కలిసి జరుపుకున్నారు. తరచుగా కలిసి కనిపిస్తున్నారు. దాంతో ఎఫైర్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. 
 

25
Tamannah Bhatia

అయితే ఈ వార్తలను తమన్నా ఖండిస్తూ వచ్చింది. తానెవరినీ ప్రేమించడం లేదని తమన్నా కథనాలను కొట్టిపారేసింది. గత ఏడాది చివర్లో తమన్నా-విజయ్ వర్మ తమ బంధం బహిర్గతం చేశారు. అవును మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని స్పష్టత ఇచ్చారు. ఓపెన్ అయ్యాక కలిసి విహారాలు చేస్తున్నారు. విరామం దొరికితే రొమాంటిక్ టూర్స్ కి చెక్కేస్తున్నారు. 

 

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

 

35

ఇటీవల పెళ్లి వార్తలు కూడా తెరపైకి వచ్చాయి. త్వరలోనే వివాహం అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూసింది. తమన్నా-విజయ్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తాజాగా విజయ్ వర్మ తమన్నాతో బంధం గురించి ఓపెన్ అయ్యాడు. తమ రిలేషన్ కి ఎక్కడ బీజం పడిందో వెల్లడించాడు. 

45

లస్ట్ స్టోరీస్ సెట్స్ లో తమన్నా మీద తనకు ప్రేమ పుట్టిందని విజయ్ వర్మ అన్నాడు. నీతో మరింత ఎక్కువ సమయం గడపాలని ఉంది... అని విజయ్ వర్మ తమన్నాతో అన్నాడట. తమన్నాతో తన అభిప్రాయం చెప్పాక... 20-25 రోజుల తర్వాత కలుసుకున్నారట. అలా డేటింగ్ చేయడం స్టార్ట్ చేశారట. 


 

55

లస్ట్ స్టోరీస్ కి కొనసాగింపుగా లస్ట్ స్టోరీస్ 2 తెరకెక్కింది. ఈ ఆంథాలజీ సిరీస్లో తమన్నా-విజయ్ వర్మ జంటగా నటించారు. వీరి మధ్య శృంగార సన్నివేశాలు తెరకెక్కాయి. లస్ట్ స్టోరీస్ 2 లో విజయ్, తమన్నా కెమిస్ట్రీ అద్భుతం అని చెప్పాలి. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నారు. మరి వివాహం ఎప్పుడు చేసుకుంటారో చూడాలి... 

click me!

Recommended Stories