బుల్లితెరపై కామెడీ షోలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. జబర్దస్త్ వచ్చిన తర్వాత అనేక కామెడీ షోలు పుట్టుకొచ్చాయి. జబర్దస్త్ కమెడియన్లు చేస్తున్న కామెడీ కడుపుబ్బా నవ్విస్తోంది. అదే సమయంలో విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. వల్గారిటీ, డబుల్ మీనింగ్ కామెంట్స్, బాడీ షేమింగ్ ఎక్కువవుతోందనే విమర్శలు తరచుగా వింటూనే ఉన్నాం.