తనకు బ్యాగ్స్ అంటే ఇష్టమట. ఒకరకంగా పిచ్చి అని చెప్పింది విరానిక. తన వద్ద అత్యంత కాస్ట్లీ బ్యాగ్ ఉన్నట్టు చెప్పింది. దాని విలువ ఏకంగా 32లక్షలు ఉంటుందట. అంతేకాదు తన వద్ద ఏకంగా రెండు వందల వరకు బ్యాగ్‌లు ఉంటాయని, తనకు బ్యాగ్ కలెక్షన్ ఇష్టమని చెప్పింది విరానిక.
తాను ఎక్కువగా షూస్, బ్యాగ్‌లపై డబ్బు ఖర్చు చేస్తానని తెలిపింది. ఆమె ఓ వైపు న్యూయార్క్ అకాడమీ ఫౌండర్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ వర్క్ చేస్తున్నారు. ఫ్యామిలీని చూసుకుంటున్నారు.