తెలుగు స్టార్ హీరోయిన్ విలన్‌గా సన్నీ డియోల్ `జాట్` .. ట్రైలర్‌తోనే గూస్ బంమ్స్
సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `జాట్` మూవీ రూపొందుతున్న విసయం తెలిసిందే. ఈ మూవీ ట్రైలర్ బయటకు వచ్చింది. ఇందులో విలన్ పాత్ర హైలైట్ అవుతుంది.
సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `జాట్` మూవీ రూపొందుతున్న విసయం తెలిసిందే. ఈ మూవీ ట్రైలర్ బయటకు వచ్చింది. ఇందులో విలన్ పాత్ర హైలైట్ అవుతుంది.
తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ హీరోగా 'జాట్' మూవీని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. `జాట్` ట్రైలర్ అదిరిపోయింది. మాస్, యాక్షన్ ఎలిమెంట్లతో ఫ్యాన్స్ కి ఫీస్ట్ లా ఉంది. కానీ ఇందులో కొన్ని పాత్రలు హైలైట్‌గా నిలుస్తున్నాయి. ఇందులో రెజీనా కసాంద్ర పాత్ర హైలైట్ అవుతుంది. ఆమె చుట్టూనే డిస్కషన్ స్టార్ట్ అయ్యింది.
సన్నీ డియోల్ హీరోగా రాబోయే 'జాట్' సినిమాలో హీరోయిన్ రెజీనా కసాండ్రా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే ఆమెది విలన్ రోల్ అని తెలుస్తుంది. ట్రైలర్‌లో ఆ విషయం స్పష్టమవుతుంది. ఇన్నాళ్లు గ్లామర్‌తో మంత్రముగ్దుల్ని చేసిన ఆమె ఇప్పుడు విలనిజం పండించబోతుంది.
'జాట్'లో రెజీనా భారతి పాత్రలో కనిపించబోతుంది. మెయిన్ విలన్ రణతుంగా భార్యగా రెజీనా కసాండ్రా చేస్తోంది. ట్రైలర్‌లో ఆమె దుమ్ము రేపింది. ట్రైలర్‌లో ఆమె పాత్రనే హైలైట్‌గా నిలచింది.
34 ఏళ్ల రెజీనా కసాండ్రా తమిళ, తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తోంది. ఆమె చాలా మంచి పాత్రలు చేసింది. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలిగింది.
రెజీనా కసాండ్రా 2005లో తమిళ సినిమా 'కండా నాల్ మొదల్'తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యావరేజ్‌గానే ఆడింది. ఆ తర్వాత `అజిగియా అసురా` అనే మూవీలో చేసింది.
రెజీనా 2010లో వచ్చిన 'సూర్యకాంతి' మూవీతో కన్నడ సినిమాలోకి అడుగు పెట్టింది. అక్కడ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `శివ మనసులో శృతి`, `రొటీన్ లవ్ స్టోరీ` చిత్రాలు చేసింది. ఇది పెద్దగా ఆడలేదు. `కొత్తజంట`తో హిట్ అందుకుంది. దీంతో వరుసగా తెలుగులో ఆఫర్లు వచ్చాయి.
ఇప్పటికే హిందీలో రెండు సినిమాలు చేసింది రెజీనా. 'జాట్' ఆమెకి మూడో హిందీ సినిమా. ఆమె కంగనా రనౌత్ 'తలైవి'లో కూడా చేసింది.
రెజీనా కసాండ్రా రాబోయే సినిమాల్లో చాలా సినిమాలు ఉన్నాయి. వాటిలో 'మూకుతి అమ్మన్ 2' ఒకటి. వీటితోపాటు మరో ఐదారు మూవీస్ చేస్తూ బిజీగా ఉంది రెజీనా. తెలుగులో మాత్రం ఈ బ్యూటీకి సినిమాలు లేవు. ఆమె నో చెబుతుందా? ఆమెపై మేకర్స్ ఇంట్రెస్ట్ చూపించడం లేదా అనేది తెలియాల్సి ఉంది.