సమంత సీక్రెట్ ఎంగేజ్మెంట్ ? వైరల్ అవుతున్న డైమండ్ రింగ్
సమంత రహస్యంగా ఎంగేజ్‌మెంట్ చేసుకుందనే వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె వేలికి డైమండ్ రింగ్ ఉండటంతో రాజ్ నిడిమోరుతో ఎంగేజ్‌మెంట్ జరిగిందని అభిమానులు భావిస్తున్నారు.
సమంత రహస్యంగా ఎంగేజ్‌మెంట్ చేసుకుందనే వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె వేలికి డైమండ్ రింగ్ ఉండటంతో రాజ్ నిడిమోరుతో ఎంగేజ్‌మెంట్ జరిగిందని అభిమానులు భావిస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు గత కొంతకాలంగా ప్రతీ విషయంలోనూ వార్తల్లో నిలుస్తోంది. ఆమె మీద మీడియా మొత్తం ఫోకస్ పెట్టింది.
ఇప్పుడు ఆమె సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. నాగచైతన్యతో వివాహం, విడాకులు తరువాత, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ సినిమాలు చేస్తోంది.
సమంతతో విడాకుల తరువాత నాగ చైతన్య డిసెంబర్ 2024లో నటి శోభిత ధూళిపాళను వివాహం చేసుకున్నాడు. అలాగే సమత ది ఫ్యామిలీ మ్యాన్ 2 , సిటాడెల్: హనీ బన్నీ లాంటి సిరీస్‌లతో కలిసి పనిచేసిన రాజ్ & డీకే ద్వయంలో ఒకరైన రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే తాజాగా ఆ వార్తలకు బలం చేకూరుస్తూ ఓ మేజర్ రూమర్ మొదలైంది. ఆమె చేతి వేలికి ఓ డైమండ్ రింగ్ ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దాంతో ఆమె అభిమానులు..రాజ్ నిడిమోరుతో సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ అయ్యిందని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసే అప్డేట్స్ అయితే ఏమీ లేవు.
ఇక గతంలోనే పికిల్ బాల్ టోర్నమెంట్‌లోనూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని కనిపించారు. ఆ సమయంలోనూ సమంతపై డేటింగ్ రూమర్స్ వినిపించాయి.
రీసెంట్ గా మరోసారి సామ్- రాజ్ నిడిమోరు ఓ పార్టీలో మెరిశారు. ఇప్పుడు దీంతో మరోసారి వీరిద్దరిపై నెట్టింట చర్చ మొదలైంది. నెల రోజుల్లోపే రెండోసారి జంటగా కనిపించడంతో డేటింగ్ రూమర్స్ వైరలవుతున్నాయి.
ఏదేమైనా సమంత, రాజ్ నిడిమోరు క్లారిటీ ఇస్తే కానీ ఈ వార్చలకు ఇప్పట్లో చెక్ పడేలా లేదు. అయితే తమపై వస్తున్న డేటింగ్ రూమర్స్‌పై ఇప్పటి వరకు సామ్ కానీ, రాజ్ ఎవరూ కూడా స్పందించలేదు.