Manchu Manoj: మంచు విష్ణు కోసం లేడీ గెటప్‌ వేసిన మనోజ్‌.. విష్ణు సినీ కెరీర్‌ అతని భిక్షేనా!

Published : Apr 09, 2025, 10:44 PM IST

Manchu Manoj:  మంచు మనోజ్‌ విలక్షణమైన నటన, పాత్రలతో తెలుగు ప్రజలందరికీ సుపరిచితుడు. ప్రస్తుతం బైరవ చిత్రం ద్వారా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సినిమాల్లో హీరో, విలన్‌, లేడీ గెటప్‌లతో మెప్పించాడు మనోజ్‌. అయితే.. గత కొంతకాలంగా మనోజ్‌కి అతని అన్న విష్ణుకి పడట్లేదు. కుటుంబ తగాదాల నేపథ్యంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు, దాడులకు దిగుతున్నారు. తాజాగా మనోజ్‌ మీడియా ముందుకు మరోసారి ప్రత్యక్షమయ్యారు. తన అన్న విష్ణు ఆగడాలు పెచ్చుమీరుతున్నాయని సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించాలని డిమాండ్‌ చేశారు. విష్ణు సినిమా కెరీర్‌ గురించి, మనోజ్‌ చేసిన త్యాగం గురించి చెబుతూ ఎమోషనల్‌ అయ్యాడు.   

PREV
15
Manchu Manoj:  మంచు విష్ణు కోసం లేడీ గెటప్‌ వేసిన మనోజ్‌.. విష్ణు సినీ కెరీర్‌ అతని భిక్షేనా!
manoj vs vishnu

అసలు మోహన్‌బాబు కుటుంబానికి ఏమైందో, ఎందుకు అన్నదమ్ములు రోడ్డుమీద పడి కొట్టుకుచస్తున్నారో ఇప్పటి వరకు ఎవరీకి అర్థం కాలేదు. మోహన్‌బాబు కూడా ఇద్దరినీ కూర్చోబెట్టి సయోధ్య కుదుర్చుదామన్న ఆలోచన కూడా లేనట్లు కనిపిస్తోంది. క్రమశిక్షణకు మారుపేరు అని చెప్పుకునే మోహన్‌బాబు ఇంతలా మౌనంగా ఉండటం బహుశా ఇదే మొదటిసారి. ఇదిలా ఉంటే.. ఇటీవల మనోజ్‌ ఇంట్లోని జనరేటర్‌లో విష్ణు పంచదార పోశాడని ఆరోపించి రచ్చ రచ్చ చేశాడు మనోజ్‌. ఇది మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. 

25
Manoj Manchu

తన కుమార్తె పుట్టినరోజు వేడుకలను రాజస్థాన్‌లో జరుపుకుందామని మనోజ్‌, అతని భార్య మాత్రమే వెళ్లారంట. అక్కడ వేడుకలు జరుగుతున్న తరుణంలో హైదరాబాద్‌లోని ఇంట్లో ఎవరూ లేరని గుర్తించి విష్ణు మనుషులు.. మనోజ్ ఇంట్లోకి వెళ్లి చిన్న పిల్ల బట్టలు, నగలు ఎత్తుకెళ్లారంట. దీంతోపాటు మనోజ్‌, అతని భార్య కారు కూడా రోడ్డుపై వదిలేశారని ఆరోపిస్తున్నారు. ఈ విషయాలను మనోజ్‌ బుధవారం మీడియాతో తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని.. సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. 

35

విష్ణు ప్రవర్తన, సినిమా కెరీర్‌కు సంబంధించి మనోజ్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. తన తండ్రి మోహన్‌బాబు థియేటర్‌ కట్టిస్తే.. అందులో సమోసాలు అమ్ముకుని బతకాలని కోరుకునే వ్యక్తి విష్ణు అని అన్నాడు. విష్ణు కెరీర్‌ బాలేదు, సపోర్టు కావాలని తన తండ్రి మోహన్‌బాబు అడిగినప్పుడల్లా రూపాయి డబ్బు తీసుకోకుండా పనిచేసిపెట్టినట్లు మనోజ్‌ చెప్పుకొచ్చారు. సరిగ్గా పదేళ్ల కిందట విడుదలైన పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలో తనను లేడీ గెటప్‌ వేయాలని కోరారని, ఆ సమయంలో ఆ పాత్ర చేసేందుకు ఇష్టం లేకపోయినా కూడా మోహన్‌బాబు రిక్వెస్ట్‌ చేసి అన్నకెరీర్‌ పాడవుతుంది, నీ కామెడీ బాగుంటుందని చేయాలని కోరడంతో తప్పక ఆ క్యారెక్టర్‌ చేసినట్లు మనోజ్‌ చెప్పారు. 

45

తాను గ్రాఫిక్స్‌ నేర్చుకుంటే విష్ణు గ్రాఫిక్స్‌ స్టూడియో పెట్టి వ్యాపారం చేయాలనుకునే వాడని మనోజ్‌ ఆరోపించారు. అనేక సినిమాలకు స్టంట్‌ మాస్టర్‌గా, ఫైట్‌ మాస్టర్‌గా, ఆర్టిస్ట్‌గా ఇలా అనేక పనులు ఒక్క రూపాయి తీసుకోకుండా ఒళ్లుహూనం అయ్యేలా విష్ణు సినిమాల కోసం పనిచేసినట్లు మనోజ్‌ వాపోయారు. చివరికి తిరుపతిలోని కాలేజ్‌ క్యాంపస్‌లో కూడా డబ్బులు తీసుకోకుండా పనిచేశానని అన్నారు. ఏనాడు తాను తండ్రి ఆస్తిలో నుంచి రూపాయి కూడా ఆశించలేదని మనోజ్‌ చెబుతున్నారు. 

 

55
Manoj Manchu

చెప్పుచేతల్లో మనోజ్‌ ఉండాలన్నిది విష్ణు కోరిక అని, తన జుట్టు అతనికి అప్పజెప్పాలని తన అన్న భావిస్తున్నాడని మనోజ్‌ చెబుతున్నారు. ఇంట్లోని సమస్యలు కూర్చుంటే పరిష్కారం అవుతాయని, పెద్ద మనుషుల దగ్గరకు వచ్చేందుకు విష్ణు ఆసక్తి చూపడం లేదని అంటున్నారు మనోజ్‌. కాకపోతే తిరుపతి మోహన్‌బాబు యూనివర్సిటీలో అక్రమాలుకు పాల్పడుతున్నారని, దీని వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని ఇది చూసి తాను ఉండలేకపోతున్నాని, వీటిని ప్రశ్నించినందుకే విష్ణు కక్షగట్టినట్లు మనోజ్‌ చెబుతున్నారు. ఈ వరుస ఘటనలపై మోహన్‌ బాబు స్పందన ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఈ సారి మోహన్‌బాబు నుంచి వీడియో సందేశమా లేక ఆడియో సందేశం పంపుతారో తెలియాల్సి ఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories