మైనర్లకు సంబంధించిన కేసుల్లో వేగంగా స్పందించాలి, అలాగే పారదర్శకత, జవాబుదారీతనం చాలా అవసరం. విచారణలో జాప్యం జరిగినా, మౌనం వహించినా, పక్షపాత చర్యలు తీసుకున్నా.. అది న్యాయవ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ఇది రాజకీయాలకు, వ్యక్తులకు సంబంధించిన విషయం కాదు. కేవలం నిజం బయటకు రావాలి, న్యాయం గెలవాలి. ఎలాంటి ఒత్తిళ్లు, ప్రభావాలకు తావులేకుండా ఈ కేసు దర్యాప్తు, చట్టపరమైన ప్రక్రియలన్నీ అత్యంత వేగంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. న్యాయం జరగడమే కాదు, అది జరిగినట్లు అందరికీ స్పష్టంగా కనిపించాలి. చట్టం ముందు అందరూ సమానులే అని ఈ కేసు ద్వారా మరోసారి నిరూపితం కావాలి. #Justice` అని తెలిపారు మంచు మనోజ్. ఇప్పుడిది పెద్ద రచ్చ చేస్తోంది.