Manchu Manoj : మౌనికా రెడ్డి ప్రెగ్నెన్సీపై స్పందించిన మనోజ్.. తనకు ఇప్పుడు ఎన్నో నెల అంటే?

Published : Dec 26, 2023, 04:47 PM ISTUpdated : Dec 26, 2023, 06:05 PM IST

మంచు మనోజ్ Manchu Manoj  తనకు పుట్టబొయే బిడ్డపై స్పందించారు. భార్య మౌనికా రెడ్డికి ఎన్నో నెలనో తానే స్వయంగా వెల్లడించారు. కొడుకు ధైరవ్ రెడ్డిపైనా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. 

PREV
16
Manchu Manoj : మౌనికా రెడ్డి ప్రెగ్నెన్సీపై స్పందించిన మనోజ్.. తనకు ఇప్పుడు ఎన్నో నెల అంటే?

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఈ ఏడాది పొలిటికల్ ఫ్యామిలికి చెందిన భూమా మౌనికా రెడ్డి (Bhuma Mounika Reddy)ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికీ ఇది రెండో మ్యారేజ్ అనే విషయం కూడా విధితమే. కుటుంబ సభ్యుల నమక్షంలో 2023 మార్చి 3న పెళ్లి పీటలు ఎక్కారు. అక్కా మంచు లక్ష్మి దగ్గరుండి పెళ్లి జరిపించింది. 

26

కొత్త జీవితం ప్రారంభించిన తర్వాత ఈ దంపతులు జంటగా పలు ఈవెంట్లకూ హాజరవుతున్నారు. ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా మెదులుతూ అందరి మద్దతు పొందుతున్నారు. ఇక భవిష్యత్ పైనా మంచి ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా టాయ్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు. 

36

మరోవైపు మనోజ్ కూడా టీవీ షోలు, సినిమాలతో బిజీ అయ్యారు. ఇవన్నీ ఒకెత్తైతే.. మంచు మనోజ్ తండ్రి కాబోతుండటం విశేషం. మౌనికా రెడ్డి ప్రెగ్నెన్సీని ఇప్పటికే మనోజ్ ప్రకటించారు. తల్లిదండ్రులు కాబోతుండటం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. 

46

తాజాగా మరోసారి అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం మౌనికా రెడ్డికి ఐదో నెల అని తెలియజేశారు. తమ రెండో బిడ్డ కోసం ఎంతోఆశగా ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. ధైరవ్ మొదటి కొడుకు అయినందుకూ సంతోషిస్తున్నామన్నారు. ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు. 
 

56

2024లో మనోజ్ తండ్రి కాబోతుండటం విశేషం. బిడ్డ పుట్టడానికి ముందే ఈ దంపతులు పలు బిజినెస్ లు కూడా ప్రారంభిస్తున్నారు. లైఫ్ లో మరింత బిజీ అయ్యేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. ఈ క్రమంలో ‘నమస్తే వరల్డ్’ సంస్థను ప్రారంభించారు. 

66

ఈ సంస్థకు మౌనికా రెడ్డి సీఈవో. చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్, బొమ్మల యానిమేషన్స్, కార్టూన్స్ ను అందుబాటులోకి తెస్తున్నారు. ఇప్పటికే ఐమాక్స్ లో స్టోర్ ను ప్రారంభించారు. తమ టాయ్స్, జియో మార్ట్, రిలయెన్స్ ల్లోనూ అందుబాటులో ఉంటాయని చెప్పుకొచ్చారు. తన కొడుకు ధైరవ్ రెడ్డి  వల్లే తమకు ఈ ఆలోచన వచ్చిందని చెప్పారు. 

Read more Photos on
click me!

Recommended Stories