ఒక దశలో రతిక వలన యావర్ గేమ్ ట్రాక్ తప్పింది. శివాజీ, ప్రశాంత్ లను కూడా పక్కన పెట్టే పరిస్థితి వచ్చింది. నాగార్జున హెచ్చరించడంతో తేరుకుని రొమాంటిక్ యాంగిల్ వదిలేశాడు. దానికి తోడు 12వ ఆమె ఎలిమినేట్ అయ్యింది. అందుకే కనీసం ఫైనల్ కి వెళ్లగలిగాడు. రూ. 15 లక్షలు సూట్ కేస్ దక్కింది.