యష్మిపై ఫీలింగ్స్ నిజమే, కానీ ఆ రోజు నన్ను అన్న మాటతో.. గౌతమ్‌ డేరింగ్‌ కామెంట్స్

First Published | Dec 16, 2024, 9:13 PM IST

గౌతమ్‌ బిగ్‌ బాస్‌ తెలుగు 8 రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. యష్మితో లవ్‌ ట్రాక్‌కి సంబంధించి స్పందించాడు. ఆయన బోల్డ్ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. 
 

బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ పూర్తయ్యింది. నిఖిల్‌ విన్‌ అయ్యాడు. కానీ విన్నర్‌కి సంబంధించి చివరి వరకు గౌతమ్‌, నిఖిల్‌ మధ్య పోటీ నెలకొంది. ఎవరు విన్నర్‌ అనే ఉత్కంఠ నెలకొంది. అందరి అంచనాలు తారుమారు అయ్యే అవకాశం ఉందా అని చివరి వరకు వెంటాడింది. కానీ నాగ్ నిఖిల్‌ని విన్నర్‌గా ప్రకటించారు. దీంతో గౌతమ్‌ డిజప్పాయింట్‌ అయ్యాడు. అయితే ఈ విషయాన్ని ఆయన ముందే ఊహించి ఉంటాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

read more: చిరంజీవికి గాలం వెయ్యాలనే ఆలోచన అల్లు రామలింగయ్యది కాదా? తెరవెనుక ఉన్న ఆ లేడీ ఎవరు?

ఇదిలా ఉంటే గౌతమ్‌ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వచ్చిన రెండో వారంలోనే ఆయన ఎలిమినేట్‌ కావాల్సింది. కానీ మణికంఠ సెల్ఫ్‌ ఎలిమినేషన్‌కి వెళ్లడంతో గౌతమ్‌ సేవ్‌ అయ్యాడు. ఆ తర్వాత పుంజుకున్నాడు. అశ్వత్థామ 2.0 అన్నట్టుగానే రెచ్చిపోయాడు. ఓటింగ్‌లో జోరు చూపించాడు. టాప్‌ కంటెస్టెంట్‌ అనిపించుకున్నాడు. అంతేకాదు విన్నర్‌ గేమ్‌లోకి వచ్చాడు. 
 

Tap to resize

ఈ క్రమంలో హౌజ్‌లో గౌతమ్‌ యష్మితో లవ్‌ ట్రాక్‌ కోసం ప్రయత్నించాడు. ప్రారంభంలో ఆమె కాస్త దూరం పెట్టినా, ఆ తర్వాత క్లోజ్‌ అయ్యింది. ఆ సమయంలోనే తన ఫీలింగ్స్ బయటపెట్టాడు గౌతమ్‌. కానీ తనకు ఆ ఫీలింగ్స్ లేదని చెప్పింది. ఫ్రెండ్‌గా ఓకే గానీ, తనపై ఫీలింగ్స్ లేవని తెలిపింది.

ఆ తర్వాత దూరం పెట్టింది. యష్మి ప్రవర్తన నచ్చకపోవడంతో గౌతమ్‌ కూడా ఆమెని దూరం పెట్టాడు. ఓ నామినేషన్‌లో ఏకంగా అక్క అంటూ సంబోధించి ఆమెకి కాలేలా చేశాడు. ఇది పెద్ద రచ్చ అయ్యింది. 

also read: సుడిగాలి సుధీర్‌, రష్మి రహస్యంగా కలుస్తున్నారా? ఆవేశంలో అసలు మ్యాటర్‌ లీక్‌ చేసిన జబర్దస్త్ కమెడియన్‌

తాజాగా దీనిపై వివరణ ఇచ్చాడు గౌతమ్‌. ఏడో సీజన్‌లో శుభ శ్రీతో, ఇప్పుడు యష్మితో లవ్‌ ట్రాక్‌లకు సంబంధించి గౌతమ్‌ మాట్లాడుతూ, శుభ శ్రీతో ఫ్రెండ్‌గా స్టార్ట్ అయ్యామని, అది కాస్త పెరిగిందని, అది మరింత పెరిగే క్రమంలోనే ఆమె ఎలిమినేట్‌ అయ్యిందని, దీంతో అక్కడితో అది కట్‌ అయ్యిందన్నారు.

ఈ ఏడాది కాలంలో తనకు నిజమైన ప్రేమ దొరకలేదని, ఆ ఎమోషన్స్ ఉండిపోయాయని బిగ్‌ బాస్‌ తెలుగు 8 హౌజ్‌లో యష్మిపై ఆ ఫీలింగ్స్ కలిగినట్టు తెలిపాడు. ఎమోషనల్‌గా అది ఇంపాట్చువేషన్స్(ప్రేరణలు) కలిగినట్టు తెలిపారు. అయితే ఆమెకి ఇది ఇష్టం లేదని చెప్పడంతో తాను కూడా బ్యాక్‌ అయినట్టు తెలిపారు. 
 

యష్మి ఓ రోజు తనపై ఒక్క కన్నుకొడితే పడి ఉంటావనే కామెంట్‌ చేసింది. దీంతో అది తనకు మండిందన్నారు. తాను కన్నుకొడితే పడిపోవడమేంటి, ఎలా కనిపిస్తున్నా అని చెప్పి, ఆ రోజుతో ఆమె అంటే నచ్చలేదని తెలిపాడు గౌతమ్‌. అక్క అని పిలవడంపై స్పందిస్తూ, ఇదంతా జరిగిన తర్వాత ఆమె నా విషయంలో మధ్యలో దూరి గొడవలు పెట్టుకుంటుందని,

ఇతరులకు సపోర్ట్ చేస్తూ నాపై ఫైర్‌ అవుతుందని, ఆ హీటులో అక్క అనే పదం వచ్చిందన్నారు గౌతమ్‌. మొత్తంగా యష్మిపై ఫీలింగ్స్ నిజమే అని, కానీ ఆ తర్వాత తన ప్రవర్తన నచ్చలేదని, అందుకే దూరం పెట్టినట్టు తెలిపారు గౌతమ్‌. బిగ్‌ బాస్‌ బజ్‌లో ఈ విషయాన్ని తెలిపాడు గౌతమ్‌. 

చిరు, బాలయ్య, చైతూ.. ఈ ఏడాది వెండితెరపై కనిపించని హీరోలు వీరే
 

Latest Videos

click me!