మోహన్ బాబు కుటుంబ వివాదం: మంచు మనోజ్ సంచలన ఆరోపణలు, పవన్‌, చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలకు లేఖ

Published : Dec 10, 2024, 07:51 AM ISTUpdated : Dec 10, 2024, 07:54 AM IST

సినీనటుడు మోహన్ బాబు కుటుంబంలో తలెత్తిన విభేదాల నేపథ్యంలో మంచు మనోజ్ తన తండ్రిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై, తన భార్యపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, కుటుంబ ఆస్తులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.

PREV
19
మోహన్ బాబు కుటుంబ వివాదం: మంచు మనోజ్ సంచలన ఆరోపణలు, పవన్‌, చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలకు లేఖ

సినీనటుడు మోహన్‌బాబు కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో  గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని, తనకు, తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌లో మంచు మనోజ్‌  ఫిర్యాదు చేశారు.

మరోవైపు మనోజ్‌తో తనకు ప్రాణహాని ఉందని మోహన్‌బాబు లేఖ ద్వారా రాచకొండ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో మోహన్‌బాబు (Mohan Babu) కుటుంబ గొడవలు బయటకు వచ్చాయి. ఇదిలా ఉండగా  మంచు మనోజ్‌ ఎక్స్‌ వేదికగా సోమవారం రాత్రి పోస్టు చేశారు. పారదర్శకంగా విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరారు. ఆ పోస్ట్ లో ఏముంది అంటే.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

29
Mohan Babu, Police Commissioner, Manchu Manoj

‘‘నా (Manchu Manoj)పై, నా భార్య మౌనికపై మా నాన్న మోహన్‌ బాబు లేవనెత్తిన దురుద్దేశపూరితమైన, తప్పుడు, నిరాధార ఆరోపణలను ప్రస్తావిస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. మా నాన్న లేవనెత్తిన అంశాలు తప్పే కాకుండా, నా పరువు మర్యాదలను కావాలని తీసే ప్రయత్నంలో భాగమిది. నా గొంతు బలంగా వినిపించకుండా, కుటుంబంలో అనవసర కలహాలు చెలరేగడానికి చేసే ప్రయత్నమిది’’ అని మనోజ్‌ పేర్కొన్నారు.

39
Manchu Manoj

 ఈ క్రమంలో మంచు మనోజ్ పది అంశాలతో కూడిన సుదీర్ఘ వివరణ ఇచ్చారు. పలు కుటుంబ అంశాలను ప్రస్తావించారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులను, తెలంగాణ డీజీపీని మనోజ్‌ తన పోస్ట్‌కు ట్యాగ్‌ చేశారు.  

  నాపై, నా భార్యపై చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితం. ఎవరిపై ఆధారపడకుండా, స్వతంత్రంగా, సమాజంలో ఎంతో గౌరవంగా బతుకుతున్నాం. ఆర్థిక సాయం కోసం కుటుంబంపై నేనెప్పుడూ ఆధారపడలేదు. ఎలాంటి ఆస్తిపాస్తులు అడగలేదు. అలాంటి ఆలోచన సైతం సరైంది కాదు  
 

49

 నా సోదరుడు కొన్ని కారణాల రీత్యా దుబాయికి వెళ్లడంతో, ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటోందని.. మా నాన్న, అతని స్నేహితులు కోరిక మేరకు కుటుంబానికి చెందిన ఇంట్లోకి వెళ్లాను. ఏడాదిపైగానే అదే ఇంట్లో ఉంటున్నాను. ఆ సమయంలో నా భార్య గర్భవతిగా ఉంది.

అయితే తప్పుడు ఉద్దేశంతోనే నాలుగు నెలల క్రితం నేను ఆ ఇంట్లోకి వచ్చినట్లు మా నాన్న చేసిన ఫిర్యాదులో నిజం లేదు. కావాలనే నాపై, నాభార్యపై ఆరోపణలు చేశారు. కావాలంటే గత ఏడాది కాలంగా నేను ఎక్కడ ఉంటున్నానో మొబైల్‌ ఫోన్‌ టవర్‌ లోకేషన్‌ ఆధారంగా విచారణ చేయాలని అధికారులను కోరుతున్నాను. 
 

59

    ఈ వివాదంలోకి ఏడు నెలల నా కూతురును సైతం లాగారు. ఇది ఎంతో అమానవీయం. ఇలాంటి విషయాల్లోకి నా పిల్లలను లాగవద్దు. వారిని ఈ గొడవలోకి లాగడంతోనే ఈ ఆరోపణల వెనకున్న ఉద్దేశం తెలుస్తోంది. అంతేకాకుండా ఫిర్యాదు వెనకున్న ఉద్దేశం గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.

మన దేశంలో మహిళలను ఇంటికి మూలస్తంభాలుగా పేర్కొంటారు. అయితే కుటుంబం పట్ల, పెద్దల పట్ల ఎప్పుడు గౌరవంగా ఉండే నా భార్యకు ఇలాంటి తప్పుడు ఉద్దేశాలు ఆపాదించడం సరైంది కాదు. 

69

ఇంట్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిపై మా నాన్న తీవ్రంగా దూషిస్తుండడంతో వారు తీవ్రంగా వేదనకు గురవుతున్నారు. ఇంట్లో అనుచిత ప్రవర్తన కారణంగా వారు నిరంతరం భయంతో బతుకుతున్నారు. ఈ తీవ్రమైన ఆరోపణలను నిరూపించడానికి సదరు మహిళల సమ్మతితో తీసుకున్న సాక్షాలు నా వద్ద ఉన్నాయి.

నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం దిగ్భ్రాంతికరం. మా కూతురుని పట్టించుకోకుండా ఆయా వద్ద విడిచిపెట్టి వెళ్లారని చేసిన ఫిర్యాదులో నిజం లేదు. మా అమ్మ సంరక్షణలోనే ఆయా వద్ద పాపను ఉంచాం. నా గాయానికి సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి నేను, నా భార్య ఆ సమయంలో ఆసుపత్రికి వెళ్లాం. 
 

79

   ఇంట్లో ఉన్న సీసీ టీవీ ఫుటీజేలు ఏమయ్యాయి? విష్ణు అనుచరులైన విజయ్‌ రెడ్డి, కిరణ్‌ వాటిని ఎందుకు తొలగించారు? ఈ ఘటన తీవ్రమైన ఆందోళనను, ప్రశ్నలను రేకెత్తిస్తోంది. వారు ఎందుకు ఈ ఫుటేజీలను దాచిపెడుతున్నారు? విచారణ చేపట్టి దీని వెనకున్న నిజాన్ని కనుగొనాలి.     నా శ్రమ, ప్రతిభ, నా శ్రేయోభిలాషుల మద్దతుతో ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రగా ఉంటూ కెరీర్‌ను నిర్మించుకున్నాను.

ఎనిమిదేళ్లుగా విశ్రాంతి లేకుండా మా నాన్న, సోదరుడి చిత్రాలకు పనిచేశాను. పాటలకు, ఫైట్లకు, మ్యూజిక్‌ వీడియోలకు దర్శకత్వం వహించాను. పలు చిత్రాల్లో కమర్షియల్‌ హీరోగా చేశాను. కుటుంబం గురించి ఆలోచించి వీటన్నింటికీ ఒక్కరూపాయి తీసుకోకుండా చేశాను. ‘అహం బ్రహ్మాస్మి’ వంటి ప్రాజెక్ట్‌లు వ్యక్తిగత పక్షపాతం కారణంగా దెబ్బతిన్నాయి. అయితే నా సోదరుడు విష్ణు ఇంకా కుటుంబం నుంచి మద్దుతు పొందుతూనే ఉన్నాడు. 

89

   నేనెప్పుడు కుటుంబ ఆస్తులను అడగలేదు. ఎప్పుడైనా ఆస్తులు అడిగినట్టు నిరూపించండని సవాల్‌ చేస్తున్నాను. నా వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా నా జీవితాన్ని నిర్మించుకున్నాను. కుటుంబ ఆస్తిపాస్తులపై ఆధారపడకుండా నా పిల్లలను పెంచుతున్నందుకు ఎంతో గర్వంగా ఉంది.  

  నా తండ్రి ఇలా ఫిర్యాదు  చేయడం యాదృచ్ఛికం కాదు. విష్ణు, ఆయన అసోసియేట్‌ వినయ్‌ మహేశ్వరి.. మోహన్‌బాబు యూనివర్సిటీ(ఎంబీయూ) విద్యార్థులను, స్థానిక వ్యాపారులను దోపిడీ చేస్తున్నారు. వారికి మద్దతుగా బహిరంగంగా మాట్లాడిన నేపథ్యంలోనే ఈ ఫిర్యాదు చేశారు. ఆర్థిక అవకతవకలకు సంబంధించి నా వద్ద ఆధారాలు ఉన్నాయి. కావాలంటే వాటిని  అధికారులకు సమర్పిస్తాను. 

99

    నా తండ్రి నన్ను పక్కకు తప్పించి.. విష్ణుకు ఎప్పుడూ మద్దతుగానే ఉన్నాడు. నా త్యాగాలు ఉన్నప్పటికీ నాకు అన్యాయం జరిగింది. పరువు నష్టం, వేధింపులకు గురయ్యాను. విష్ణు కుటుంబ వనరులను దుర్వినియోగం చేశాడు. స్వలాభం కోసం కుటుంబ పేరును వాడుకున్నాడు. నేనెప్పుడూ స్వతంత్రంగానే ఉన్నాను.

    కుటుంబ వివాదాలు పరిష్కారం కావడానికి నిజాయతీగా, అందరి ముందు చర్చలు జరపాలని గత సెప్టెంబర్‌లో హృదయపూర్వకంగా మా నాన్నను వేడుకున్నాను. కుటుంబ పేరును నిలబెట్టడం నా బాధ్యత అని చెప్పాను. అయితే నన్ను మానాన్న పట్టించుకోలేదు. అంతేకాకుండా ఇప్పుడు ఇలా తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాను అని మనోజ్‌ పేర్కొన్నారు. 

read more: మనోజ్ నుండి ప్రాణహాని ఉంది, కమిషనర్ కి మోహన్ బాబు ఫిర్యాదు, మరోవైపు కొడుకు కూడా!

also read: నోరు జారిన రాజేంద్రప్రసాద్‌.. ఎర్ర చందనం దొంగ హీరోనా.. అల్లు అర్జున్‌పై వ్యాఖ్యలు వివాదం?
 

 

Read more Photos on
click me!

Recommended Stories