అయితే టాప్ 5 కంటెస్టెంట్లకి గ్రాండ్‌గా స్వాగతం పలుకుతుంటారు బిగ్ బాస్. ఈ వారం మాత్రం భిన్నంగా వెళ్తున్నారు. స్టార్ మా సీరియల్స్ ఆర్టిస్ట్ లను హౌజ్‌లోకి తీసుకొచ్చి టాప్ 5 కంటెస్టెంట్లతో సరదా గేమ్‌లు ఆడిస్తున్నారు. ప్రైజ్ మనీ పెంచే అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు `నువ్వుంటే నా జతగా` సీరియల్స్ నుంచి హీరోహీరోయిన్లు దేవ(అర్జున్), మిథున వచ్చారు.
అయితే వీరి సీరియల్ ప్రోమోలోని స్కిట్‌ని హౌజ్‌మేట్స్ తో చేయించారు. అవినాష్ ప్రేరణ, నబీల్, నిఖిల్ ఇందులో పాల్గొన్నారు. సీరియల్ లో అర్జున్ చేసినట్టుగా పెళ్లికి అడ్డు వచ్చిన ప్రేరణని లాక్కెళ్లి తాళి కడతాడు అర్జున్. అలాగే ఇందులో కూడా ప్రేరణని లాకెళ్లి అవినాష్ తాళికట్టినట్టుగా సరదాగా స్కిట్ ప్రదర్శించారు. ఇది ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఆ తర్వాత ఒక టాస్క్ ఇచ్చారు. ఇందులో బిబి పరివారం విన్ అయ్యింది. స్టార్ మా పరివార్ ఓడిపోయింది. దీంతో ఆ ప్రైజ్‌మనీ యాడ్ అయ్యింది.