ఏళ్లపాటు వనవాసం చేశాం.. ఎన్ని డోర్లు మూస్తారో మూయండి.. ఆసక్తికరంగా మంచు మనోజ్ కామెంట్స్..

Published : Apr 13, 2023, 02:00 PM IST

ప్రముఖ నటుడు వెన్నెల కిషోర్ హోస్ట్ గా కొనసాగుతున్న ‘అలా మొదలైంది’ టాక్ షోకు హీరో మంచు మనోజ్ - భూమా మౌనికా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మనోజ్ వెల్లడించిన విషయాలు ఆసక్తికరంగా మారాయి.   

PREV
16
ఏళ్లపాటు వనవాసం చేశాం.. ఎన్ని డోర్లు మూస్తారో మూయండి.. ఆసక్తికరంగా మంచు మనోజ్ కామెంట్స్..

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ (Manchu Mounika) - భూమా మౌనిక (Bhuma Mounika) వివాహ వేడుక మార్చి 3,4 తేదిన అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగింది. అక్క మంచు లక్ష్మి పెళ్లి పెద్దగా నిలిచిన విషయం తెలిసిందే. 
 

26

అయితే మనోజ్ - మౌనికా రెడ్డి పెళ్లి తర్వాత తిరుపతిలో కనిపించారు. తాజాగా వెన్నెల కిషోర్ (Vennela Kishore) హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘అలా మొదలైంది’షోలో మెరిశారు. ఇప్పటికే ఈషోకు నిఖిల్ - పల్లవి కలిసి అతిథిగా హాజరై అలరించారు.  
 

36

లేటెస్ట్ ఎపిసోడ్ లో మనోజ్ - భూమా మౌనికా రెడ్డి గెస్ట్ లుగా హాజరయ్యారు. వారిద్దరిని వెన్నెల కిషోర్ షోకు స్వాగతించారు. బ్యూటీపుల్ కపుల్ షోకు ఎంట్రీ ఇస్తూనే ఎనర్జీని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా  మనోజ్ వెన్నెల కిషోర్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరంగా బదులిచ్చారు.
 

46

‘ఎన్నో సంవత్సరాలు మేం దేశదేశాలు తిరుగుతూ వనవాసం చేశాం. మౌనికాను వాళ్ల అమ్మ చనిపోయినప్పుడు అలాంటి పరిస్థితిలో చూసి తట్టుకోలేకపోయాను. ఆమెకు అండగా ఉండకపోతే నేనే బతికే వేస్ట్ అనిపించింది. ఎన్నో డోర్లు మూస్తారో మూయండి’ అంటూ కామెంట్లు పెట్టారు. 
 

56

రీసెంట్ గా విష్ణు - మనోజ్ మధ్య ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. మనోజ్ - మౌనికా పెళ్లి విషయంలోనే ఆ ఘర్షణలు తలెత్తాయని తెలుస్తోంది. ఈ క్రమంలో మనోజ్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారింది. తమ లవ్ ట్రాక్ పైన కూడా ‘అలా మొదలైందంటూ’ ఆసక్తి పెంచారు.  
 

66

మంచు - మనోజ్ ప్రేమకథ, తర్వాత తాము ఎదుర్కొన్న సమస్యలపై పూర్తి వివరాలు తెలియాలంటే ఏప్రిల్ 18 వరకు ఆగాల్సిందే. ఆరోజున ఫుల్ ఎపిసోడ్ విడుదల కానుంది. ఈక్రమంలో మంచు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మనోజ్ ప్రస్తుతం ‘వాట్ ద ఫిష్’లో నటిస్తున్నారు.
 

Read more Photos on
click me!

Recommended Stories