Niharika: విడాకుల వార్తల నడుమ రెచ్చిపోయిన మెగా డాటర్ నిహారిక... డెనిమ్ జీన్స్ లో బోల్డ్ ఫోటో షూట్!

Published : Apr 13, 2023, 01:56 PM IST

ఒకప్రక్క నిహారిక విడాకుల వార్తలు చక్కర్లు కొడుతుండగా ఆమె బోల్డ్ ఫోటో షూట్ తో మైండ్ బ్లాక్ చేశారు. కొత్త చర్చకు దారి తీశారు.   

PREV
18
Niharika: విడాకుల వార్తల నడుమ రెచ్చిపోయిన మెగా డాటర్ నిహారిక... డెనిమ్ జీన్స్ లో బోల్డ్ ఫోటో షూట్!
Niharika Konidela

నాగబాబు తనయ నిహారిక భర్తతో విడిపోయారనేది టాలీవుడ్ హాట్ టాపిక్. గత మూడు వారాలుగా వరుసగా కథనాలు వెలువడుతున్నాయి. ఇంత సీరియస్ మేటర్ నడుస్తుండగా నిహారిక హాట్ ఫోటో షూట్ చేయడం పరిశ్రమ వర్గాలను ఆకర్షించింది. ఈ క్రమంలో నిహారిక మనసులో ఏముందని జనాలు వాపోతున్నారు.

28
Niharika Konidela

ఈ ఫోటో షూట్ విడాకులపై నిహారిక ఇచ్చిన మరొక హింట్ అంటున్నారు. చాలా కాలంగా విడాకులైన సెలబ్రిటీ లేడీస్ తమ భర్తలను రెచ్చగొట్టేలా హాట్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. ఫారిన్ లో మొదలైన ఈ ట్రెండ్ ఇండియాకు పాకింది. నాగ చైతన్యతో విడిపోయిన సమంత సైతం ఈ తరహా ఫోటో షూట్ చేశారు.

38
Niharika Konidela

నిహారిక ఇప్పుడు చేసింది అదే అంటున్నారు. నువ్వు నీ మూర్ఖత్వం, మొండితనం వలన నా లాంటి ఓ ఏంజెల్ ని కోల్పోయావు అని చెప్పేందుకు సెలెబ్రిటీలు పోస్ట్ డివోర్స్ ఫోటో షూట్స్ చేస్తుంటారు. నిహారిక ఫోటో షూట్ అలాంటిదే కావచ్చని ఓ అంచనా. 
 

48
Niharika Konidela

మార్చిలో నిహారిక భర్త వెంకట చైతన్య ఇంస్టాగ్రామ్ నుండి పెళ్లి ఫోటోలు తొలగించారు. అలాగే ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా డిలీట్ చేశారు. ఇద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. ఈ క్రమంలో వెంకట చైతన్య-నిహారిక మధ్య మనస్పర్థలు తలెత్తాయి. విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారంటూ వరుస కథనాలు వెలువడ్డాయి. 
 

58
Niharika Konidela

ఈ వార్తలపై నిహారికతో పాటు కుటుంబ సభ్యులు ఎవరూ స్పందించలేదు. ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. కాంప్రమైజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. వెంకట చైతన్య-నిహారిక మధ్య సమస్యలు తీరాయి. కలిసిపోయారన్న వార్తలు కూడా వచ్చాయి. 

68
Niharika Konidela


 అందరికీ షాక్ ఇస్తూ నిహారిక కూడా ఇంస్టాగ్రామ్ అకౌంట్లోని తన పెళ్లి ఫోటోలు డిలీట్ చేసింది. కొన్ని అరుదైన జ్ఞాపకాలు మాత్రం ఉంచుకొని... వెంకట చైతన్యతో ఉన్న ఫోటోలు తీసేసింది. అమ్మ నిశ్చితార్థం చీర కట్టుకున్న ఫోటో, హల్దీ ఫంక్షన్ ఫోటో...ఇలా ఒకటి రెండు మాత్రమే అట్టి పెట్టారు. మొత్తం తీసేశారు. ఈ క్రమంలో... నిహారిక పరోక్షంగా హింట్ ఇచ్చేశారని పలువురు భావిస్తున్నారు. 

78
Niharika Konidela

అలాగే నిహారిక హైదరాబాద్ లో ఆఫీస్ ఓపెన్ చేశారు. తన నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్స్ బ్యానర్ ని ఆమె మరో అడుగు ముందుకు తీసుకెళ్లారు. నిహారిక తన ప్రొడక్షన్ కంపెనీ కోసం కొత్త ఆఫీస్ కి సంబంధించిన ఫోటోలు నిహారిక ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేశారు. భర్తతో విడిపోయిన నిహారిక కెరీర్ మీద ఫోకస్ పెట్టారని, నిర్మాతగా రాణించాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు.

88
Niharika Konidela


2020 డిసెంబర్ 9న నిహారిక వివాహం ఘనంగా జరిగింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో ఐదు రోజులు ఘనంగా పెళ్లి వేడుక నిర్వహించారు. నిహారిక-వెంకట చైతన్యల వివాహానికి మెగా హీరోలందరూ హాజరు కాగా నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది. పెళ్లి తర్వాత నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.

click me!

Recommended Stories