మంచు మనోజ్ మాట్లాడుతూ... ‘‘నిన్న నేను సినిమా షూటింగ్ లో ఉన్నాను.మా అబ్బాయి స్కూల్‌లో ఈవెంట్‌కు నా సతీమణి హాజరైంది. మా అమ్మ పుట్టినరోజు సందర్భంగా కేకు ఇచ్చే నెపంతో.. నా సోదరుడు విష్ణు తన అనుచరులు రాజ్ కొండూరు, కిరణ్, విజయ్ రెడ్డిలతోపాటు కొందరు బౌన్సర్లతో ఇంట్లోకి ప్రవేశించాడు.
జనరేటర్లలో షుగర్ పోయించాడు. దాంతో, రాత్రి విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మేమంతా ఆందోళనకు గురయ్యాం. ఇంట్లో అమ్మ, తొమ్మిది నెలల కుమార్తె, కుమారుడు, అత్తమామలు ఉన్నారు. ఈ చర్యతో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. జనరేటర్లకు సమీపంలో వాహనాలు పార్క్ చేసి ఉన్నాయి.