మొదలు కాకుండానే మోక్షజ్ఞ సినిమాకు బ్రేక్ పడిందా? ఇదిప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రశాంత్ వర్మతో బాలయ్యకు విబేధాలు తలెత్తాయట. వీరిద్దరికీ పొసగడం లేదట. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ డైరెక్టర్ మారే అవకాశం ఉందని అంటున్నారు.
నందమూరి మూడో తరం వారసుడు మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇప్పటికే ఆలస్యమైంది. ఆయన వయసు 30 ఏళ్ళు. ఈపాటికే మోక్షజ్ఞ కనీసం పది సినిమాలు చేయాలి. జూనియర్ ఎన్టీఆర్ ఈ వయసుకు హిట్స్, బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ తో టాలీవుడ్ స్టార్ హీరో స్థాయికి వెళ్ళాడు. ఒక దశలో మోక్షజ్ఞకు నటుడు కావడం ఇష్టం లేదనే ప్రచారం జరిగింది. మోక్షజ్ఞను అలా వదిలేద్దాం అంటే... ఫ్యాన్స్ నుండి బాలయ్యకు తీవ్ర ఒత్తిడి ఉంది. ఎలాగొలా బ్రతిమిలాడి ఒప్పించాడని టాక్.
Mokshagna
ఇక మోక్షజ్ఞ డెబ్యూ డైరెక్టర్ ఎవరనే విషయంలో చాలా తర్జనభర్జనలు జరిగాయి. పలువురు స్టార్ హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. బాలకృష్ణ స్వయంగా దర్శకత్వం వహిస్తారంటూ కూడా ప్రచారం జరిగింది. ఎట్టకేలకు ప్రశాంత్ వర్మను లాక్ చేశారు. సోషియో ఫాంటసీ సబ్జెక్టు తో ప్రశాంత్ వర్మ రాసిన కథ బాలకృష్ణకు బాగా నచ్చిందట. అందులోనూ హనుమాన్ మూవీతో భారీ బ్లాక్ బస్టర్ కొట్టి ఉన్నాడు. ఫార్మ్ లో ఉన్న యంగ్ డైరెక్టర్ కావడంతో బాలకృష్ణ మొగ్గు చూపాడు.
ఏక కాలంలో ప్రశాంత్ వర్మ రెండు మూడు ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టాడు. రిషబ్ శెట్టితో హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ ప్రకటించాడు. ఇక మోక్షజ్ఞ మూవీ పూజా కార్యక్రమం డిసెంబర్ 5న జరగాల్సి ఉందట. దీని కోసం లక్షలు ఖర్చు చేసి భారీ సెట్ కూడా వేశారట. ప్రశాంత్ వర్మ కారణంగా మోక్షజ్ఞ మూవీ పూజా కార్యక్రమం ఆగిపోయిందట.
నేను కథ మాత్రమే ఇస్తాను. మూవీకి నా అసిస్టెంట్ దర్శకుడిగా పని చేస్తాడని చెప్పాడట. దాంతో బాలయ్యకు కోపం నషాళానికి ఎక్కిందట. అన్ స్టాపబుల్ సీజన్ 4 ట్రైలర్ కట్ అడిగినా కూడా ప్రశాంత్ వర్మ భారీగా డబ్బు డిమాండ్ చేశాడట. దాంతో వేరొకరితో చేయించారట. హనుమాన్ మూవీ సక్సెస్ తో ప్రశాంత్ వర్మకు టెక్కు ఎక్కువైంది. ఎవరినీ లెక్క చేయడం లేదు. రెమ్యునరేషన్ పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. చూస్తుంటే మోక్షజ్ఞ-ప్రశాంత్ వర్మ మూవీ కార్యరూపం దాల్చడం కష్టమే అంటున్నారు.
Mokshagna
మోక్షజ్ఞతో ప్రాజెక్ట్ మిస్ అయితే.. నిర్మాత దానయ్య కొడుకుతో ఈ సినిమా చేసేందుకు ప్రశాంత్ వర్మ సిద్ధంగా ఉన్నాడట. ప్రశాంత్ వర్మతో చెడితే బాలయ్య సెకండ్ ఆప్షన్ ఏమిటనే ఆలోచనలో పడ్డాడట. దీనిపై కసరత్తు చేస్తున్నారట. ఈ పరిణామాలు బాలయ్య ఫ్యాన్స్ లో తీవ్ర అసహనం రాజేస్తున్నాయట. మరోవైపు మోక్షజ్ఞతో మూవీ చేసేందుకు లక్కీ భాస్కర్ ఫేమ్ వెంకీ అట్లూరి సిద్ధం అవుతున్నాడట. అలాగే నాగ్ అశ్విన్ కూడా మోక్షజ్ఞతో మూవీ చేయాలనే ఆసక్తితో ఉన్నారంటూ కథనాలు వెలువడుతున్నాయి.