అందం ఉన్నా అదృష్టం లేని బ్యూటీ.. ఈ చిన్నది ఎవరో గుర్తు పట్టారా.?

First Published | Dec 16, 2024, 11:16 AM IST

Actress: సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత సినీతారలకు, అభిమానులకు మధ్య దూరం తక్కువైంది. అభిమానులు నేరుగా తమ అభిమాన నటీ, నటులతో చాట్ చేసే రోజులు వచ్చేశాయ్‌. దీంతో హీరోయిన్లు తమ లేటెస్ట్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఓ హీరోయిన్‌కు సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.. 
 

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్‌ కావాలంటే ట్యాలెంట్‌తో పాటు ఎంతో కొంత అదృష్టం కూడా ఉండాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక హీరోయిన్ల విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. హీరోయిన్ల విషయంలో కూడా గ్లామర్‌ ఎంత పాత్ర పోషిస్తుందో, అదృష్టం కూడా అంతే పాత్ర పోషిస్తుంది. అయితే కొంత మందికి అందం ఉన్నా, అదృష్టం కలిసి రాదు అలాంటి జాబితాలోకే వస్తుంది పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ. తన అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ఈ చిన్నది కెరీర్‌ విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయింది. 
 

తొలి సినిమాతోనే ఇండస్ట్రీని షేక్‌ చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంది. అయినా విజయాన్ని మాత్రం ఖాతాలో వేసుకోలేకపోయింది. అయితే తొలి సినిమాతో విజయాన్ని అందించిన దర్శకుడే తాజాగా మరో విజయాన్ని అందించాడు. ఇంతకీ ఈ హీరోయిన్‌ ఎవరో ఈపాటికే మీకు ఓ క్లారిటీ వచ్చేసి ఉంటుంది కదూ! అవును ఈ హీరోయిన్‌ మరెవరో కాదు అందాల తార పాయల్‌ రాజ్‌పుత్‌. 
 

Tap to resize

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన పాయల్ రాజ్‌పుత్‌ ఈ సినిమాలో తన అందం, అభినయంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. ఆ తర్వాత వెంకీమామ, డిస్కోరాజా వంటి బడా సినిమాల్లో నటించే ఛాన్స్‌ కొట్టేసినా ఆశించిన స్థాయిలో విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. కాగా తొలి సినిమాతో విజయాన్ని అందించిన అజయ్‌ భూపతి 'మంగళవారం' సినిమాతో మరోసారి ట్రాక్‌లోకి వచ్చింది పాయల్‌. 
 

ఈ సినిమాలో బోల్డ్‌ పాత్రలో నటించిన పాయల్‌ తన అద్భుత నటనతో మెస్మరైజ్ చేసింది. ఈ సినిమా విజయంతో మరోసారి పాయల్‌కు అవకాశాలు క్యూ కట్టాయి. పాయల్ ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలతో పాటు తెలుగులో ఒక చిత్రంలో నటిస్తోంది. ఇక సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‌గా ఉండే పాయల్‌.. తన లేటెస్ట్ ఫొటోలను, అప్‌డేట్స్‌ను అభిమానులతో పంచుకుంటుంది. 

ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. సిల్వర్‌ కలర్‌ లెహంగాలో అందానికే అసూయ పుట్టేలా ఉన్న వీడియోను ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుందీ చిన్నది. రాయల్‌ వైబ్స్‌ ఓన్లీ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను షేరగా.. 'అచ్చంగా దేవ కన్యాలా ఉన్నవంటూ' అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు.  
 

Latest Videos

click me!