ఇక ప్రస్తుతం ముంబల్ సెటిల్ అయ్యారు లక్ష్మి. హైదారాబాద్ లో మంచు వారి ఇంట్లో పరిస్థితి ఎలా ఉండో అందరికి తెలిసిందే. మంచువారి అన్నతమ్ములు విష్ణు, మనోజ్ మధ్య ఆస్తి గొడవలు, మోహన్ బాబు కేసులు, ఇలా రచ్చ రచ్చ జరుగుతుంటే.. ఆమె మాత్రం ఇంత వరకూ వీటిపై స్పందించలేదు. హైదరాబాద్ కూడా వచ్చినట్టు కనిపించలేదు. మరి ఈ గొడవలో ఆమె ఏ తమ్ముడివైపు ఉంటారు అనేది కూడా తెలియడం లేదు. ఫ్యామిలీ అంతా వ్యతిరేకించినా.. తన చిన్న తమ్ముడు మనోజ్ పెళ్ళి ఆమె తన ఇంట్లో దగ్గరుండి చేయించారు.