Mohan Babu House: అబ్బురపరిచేలా మోహన్ బాబు ఇల్లు.. ప్రతి గది సీక్రెట్స్ రివీల్ చేసిన మంచు లక్ష్మీ

First Published | Dec 27, 2021, 5:04 PM IST

మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి తన యూట్యూబ్ ఛానల్ లో హోమ్ టూర్ అనే కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మంచు లక్ష్మీ తన తన తండ్రి మోహన్ బాబు ఇంటి విశేషాలపై వీడియో చేసింది.

మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి తన యూట్యూబ్ ఛానల్ లో హోమ్ టూర్ అనే కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మంచు లక్ష్మీ తన తన తండ్రి మోహన్ బాబు ఇంటి విశేషాలపై వీడియో చేసింది. ఈ వీడియో ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. 

మోహన్ బాబు ఇల్లు ఇంద్రభవనాన్ని తలపిస్తూ అబ్బురపరుస్తోంది.  అందాల కోటని తలపించేలా అధునాతన సౌకర్యాలతో మోహన్ బాబు ఇల్లు ఆకర్షిస్తోంది. ఇది మానాన్న ఇల్లు అంటూ మంచు లక్ష్మి ఇంటి విశేషాల్ని ప్రారంభించింది. ఇంటి టాప్ వ్యూ అదిరిపోయింది. అలాగే ఇంటీరియర్ డిజైన్ కూడా ఆకర్షణీయంగా ఉంది. 


పచ్చని చెట్లు స్విమింగ్ పూల్స్ వీడియోలో కనిపిస్తున్నాయి. మంచు లక్ష్మీ తన కుమార్తెతో కలసి ఇల్లు మొత్తం తిరుగుతూ ఉండగా.. మోహన్ బాబు తన మనవరాలితో ఆడుకుంటూ కనిపిస్తున్నాడు. వంటగది, బిగ్ స్క్రీన్ ఉండే గది చాలా అందంగా ఉన్నాయి. వంట గదిలో విష్ణు ఇక్కడే వంట చేస్తాడు అంటూ మంచు లక్ష్మి చూపించింది. 

టాప్ ఫ్లోర్ మొత్తం మోహన్ బాబుదే అట. ఇది నాన్న ఫ్లోర్.. అని మంచు లక్ష్మి అంటుండగా మోహన్ బాబు మధ్యలో వచ్చి ఇల్లు మొత్తం చూపించేస్తున్నావా అంటారు. దీనికి మంచు లక్ష్మి ఆల్రెడీ చూసేశారు కదా నాన్న అంటుంది. దీనితో మోహన్ బాబు మంచు లక్ష్మిని చనువుగా కొడతారు. ఆమెపై చేయి చేసుకుంటారు. 

మోహన్ బాబు ఇంట్లో ఆయన చిత్ర పటాలు, అవార్డులకు ఒక గది కేటాయించారు. పూర్తి వీడియోని మంచు లక్ష్మి త్వరలోనే విడుదల చేయనుంది. ప్రోమోలో చూపినట్లుగా మోహన్ బాబు నివాసంలోని ప్రతి అంగుళం అబ్బురపరిచేలా ఉంది. 

మంచు లక్ష్మి నటిగా రాణిస్తూనే ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వీడియోలు చేస్తోంది. ఇక ఇంస్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ఖాతాల్లో మంచు లక్ష్మి తన గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేస్తూ ఉంటుంది. Also Read: జ్యోతిష్యంలో ఉన్నట్లుగానే నటుడి సోదరుడు మృతి.. ఆ రెండూ చెప్పినట్లే జరిగాయి

Latest Videos

click me!