అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన చిత్రాల్లో మనం మూవీ ఒక క్లాసిక్ గా మిగిలిపోతుంది. నాగ చైతన్య, నాగార్జున ఇద్దరికీ ఆ చిత్రం ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. అక్కినేని నాగేశ్వర రావు గారితో నాగార్జున, చైతు నటించిన చివరి చిత్రం అదే.
26
డైరెక్టర్ విక్రమ్ కుమార్ ఆ చిత్రంతో చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. చిత్ర పరిశ్రమలో ప్రతి క్లాసిక్ మూవీ వెనుక చాలా తతంగమే జరిగి ఉంటుంది. తెరవెనుక జరిగిన సంఘటనలు కొన్ని బయటకి రావు. కొన్ని బయటకి వస్తే ఇంత జరిగిందా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఈ చిత్రం విడుదలై నేటికి సరిగ్గా పదేళ్లు. ఈ సందర్భంగా మనం రీ రిలీజ్ అవుతోంది.
36
దీనితో మనం చిత్రానికి సంబంధించిన విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి డైరెక్టర్ విక్రమ్ కుమార్ మనం కథని అక్కినేని ఫ్యామిలీ కోసం రాయలేదు. అన్ని చిత్రాల్లాగే దీనిని కూడా ఒక కథగా భావించి రాసుకున్నారు. హీరో సిద్దార్థ్ కి అయితే ఈ చిత్రం బాగా సెట్ అవుతుందని భావించారు. అలా సిద్దార్థ్ ని సంప్రదించడం జరిగింది.
46
సిద్దార్థ్ తండ్రి పాత్రలో విక్టరీ వెంకటేష్ ని అనుకున్నారు. వెంకటేష్ తండ్రిగా లెజెండ్రీ డైరెక్టర్ కె విశ్వనాథ్ గారిని అనుకున్నారు. అంతా ఒకే అనుకున్న తరుణంలో దురదృష్టం సిద్దార్థ్ ని వెంటాడింది. ఆ టైంలోనే నాగార్జున తన ఫ్యామిలీతో ఒక మంచి కథ కోసం వెతుకుతున్నారు నాగార్జునకి విక్రమ్ కుమార్ నుంచి పిలుపు వచ్చింది.
56
నాగార్జున రిక్వైర్ మెంట్స్ కి తగ్గట్లుగా ఆ సమయంలో విక్రమ్ కుమార్ దగ్గర ఉన్న కథ మనం. దీనితో వెంటనే విక్రమ్ కుమార్ ఆ కథని నాగ చైతన్య, నాగార్జున, ఏఎన్నార్ లకి అన్వయిస్తూ మార్పులు చేశారు. ఆ తర్వాత మనం ఎంత సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.
66
ఒక సందర్భంలో సిద్దార్థ్ మనం చిత్రం తన చెతిలొనుంచి జారిపోయింది గుర్తు చేసుకున్నాడు. మనం చిత్రంలో కథలో ఉండే మలుపులు, స్క్రీన్ ప్లే మ్యాజిక్ విపరీతంగా ఆకట్టుకుంటాయి. సమంత నాగ చైతన్య.. నాగార్జున శ్రీయ.. ఏఎన్నార్ అద్భుతంగా నటించారు. వీటన్నింటికి తోడు అనూప్ రూబెన్స్ సంగీతం కూడా ఈ చిత్రానికి హైలైట్.