ఇండియన్ 2 షూటింగ్ కడప పరిసర ప్రాంతాల్లో జరిగింది. తిరుపతి నుంచి 2 గంటలు జర్నీ. నా కొడుకుకి నేను పలు ఇవ్వాలి కదా. అందుకే మా అమ్మని, కొడుకుని తిరుపతిలో ఉంచా. షూటింగ్ లొకేషన్ లో క్యారవ్యాన్ లోకి వెళ్లి బాటిల్ లో పాలు నింపేదాన్ని. పాలు పాడవకుండా ఐస్ లో పెట్టి కారులో మా డ్రైవర్ చేత తిరుపతికి పంపేదాన్ని. రోజుకి రెండు సార్లు ఇలా చేయాల్సి వచ్చేది. అంటే డ్రైవర్ 8 గంటలు డ్రైవ్ చేస్తూనే ఉండాలి.