MSG 21 Day Collections: సండే రోజు సడెన్‌ జంప్‌.. చిరంజీవి మన శంకర వర ప్రసాద్‌ గారు బాక్సాఫీసు వద్ద ర్యాంపేజ్‌

Published : Feb 02, 2026, 12:21 PM IST

MSG Collections: చిరంజీవి హీరోగా వచ్చిన `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ 21 రోజులు పూర్తి చేసుకుంది. ఈ మూవీ సండే రోజు కలెక్షన్లు ఊహించిన విధంగా భారీగా జంప్ అయ్యాయి. 

PREV
14
మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీ బాక్సాఫీసు ర్యాంపేజ్‌

చిరంజీవి, నయనతార, వెంకటేష్‌ కలిసి నటించిన `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ రీజనల్‌ ఫిల్మ్స్ లో ఇండస్ట్రీ హిట్‌ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ కాసుల వర్షం కురిపిస్తోంది. లేటెస్ట్ గా 21వ రోజు కూడా సత్తా చాటింది. గత వారంతో పోల్చితే కలెక్షన్లు పెరిగాయి. శుక్రవారంతో పోల్చితే శనివారం పెరగ్గా, శనివారంతో పోల్చితే ఆదివారం మరింతగా పెరిగింది. మొత్తంగా చిరంజీవి మూవీ ఆదివారం ర్యాంపేజ్‌ ఆడిందని చెప్పొచ్చు.

24
ఆదివారం ఊహించని జంప్‌

శుక్రవారం ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ.కోటి ముప్పై లక్షలు రాగా, శనివారం రూ.1.9కోట్లు వచ్చాయి. వీకెండ్‌ బాగా పెరిగాయి. ఇక ఆదివారం శనివారానికి మించి వచ్చాయి. ఏకంగా రెండున్నర కోట్లు రావడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా మూడు కోట్ల వరకు ఈ సినిమా వసూలు చేసింది. అంటే 21వ రోజు కూడా ఈ స్థాయి కలెక్షన్లు అంటే మామూలు విషయం కాదు. ఇది ఊహించని జంప్‌గా చెప్పొచ్చు.

34
మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీ వరల్డ్ వైడ్‌ కలెక్షన్లు

ప్రముఖ బాక్సాఫీసు సైట్‌ సాక్నిల్క్ లెక్కల ప్రకారం 21 రోజులకుగానూ ఈ మూవీ రూ.289కోట్లు వసూలు చేసింది. ఇండియాలో రూ.208 కోట్ల నెట్‌ కలెక్షన్లు వచ్చాయి. రూ.247కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో దీనికి రూ.205కోట్ల వరకు గ్రాస్‌ కలెక్షన్లు రావడం విశేషం. ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ దాటుకుని ఏకంగా రూ.60కోట్ల లాభాలను గడించిందని టాక్‌. అంతేకాదు ఈ సినిమా రీజినల్‌ ఫిల్మ్స్ లో నెంబర్‌ వన్‌గా నిలిచింది. `హనుమాన్‌`పేరుతో ఉన్న రూ.201కోట్ల రికార్డుని బ్రేక్‌ చేసింది.

44
అన్ని వర్గాలను ఆకట్టుకున్న మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీ

ఇక చిరంజీవి హీరోగా, అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీలో నయనతార హీరోయిన్‌గా నటించింది. వెంకటేష్‌ స్పెషల్‌ రోల్‌ చేశారు. కామెడీ, ఫ్యామిలీ అంశాలు, పిల్లలకు నచ్చే ఎలిమెంట్లు, మహిళలకు సంబంధించిన అంశాలు, యూత్‌ని ఆకట్టుకునే లవ్‌ ట్రాక్‌, యాక్షన్‌ ఎలిమెంట్లని జోడించి ఈ సినిమా రూపొందించారు అనిల్‌ రావిపూడి. సంక్రాంతి పండక్కి మంచి విందు భోజనం పెట్టారు. దీంతో సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ మూవీని చిరు కూతురు సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మించారు. చిరంజీవితో చేసిన తొలి చిత్రంతోనే బ్లాక్‌ బస్టర్‌ అందుకుంది సుస్మిత. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories