తెలుగు సినిమా రంగంలో లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ ఇమేజ్ పొందిన ఏకైక హీరోయిన్ విజయశాంతి. ఆమె సినీ ప్రయాణం ఎంతోమందికి ప్రేరణగా నిలిచింది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా వెలుగు వెలిగిన విజయశాంతికి.. లేడీ సూపర్ స్టార్ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా?
విజయశాంతి చాలా చిన్నవయసులోనే వెండితెరపైకి వచ్చింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే.. 1980లో తమిళ చిత్రం కల్లుక్కల్ తో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. మొదటి సినిమా నుంచే ఆమె, తన అందం, నటనతో తెలుగు, తమిళం, హిందీ భాషలలో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. తన నటనకు ప్రశంసలు పొందిన ఆమె, ఆ తర్వాత కొన్ని సంవత్సరాల్లోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఆమె రికార్డు స్థాయిలో అవకాశాలు అందుకున్నారు.
27
మెగాస్టార్ జోడీగా ఎక్కువ సినిమాలు..
సౌత్ లో తిరుగులేని ఇమేజ్ ను సాధించిన విజయశాంతి.. టాలీవుడ్ స్టార్ హీరోలతో వరుస సినిమాల్లో మెరిసింది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఏకంగా 19 సినిమాలు చేసిన ఆమె.. బాలకృష్ణతో కలిసి 16 సినిమాల్లో జంటగా నటించింది. వీరు కాకుండా.. వెంకటేష్, కృష్ణ, సుమన్, రాజశేఖర్ వంటి తెలుగు స్టార్ హీరోలతో సూపర్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించింది విజయశాంతి. చిరంజీవి డ్యాన్స్ కు పోటీ ఇచ్చిన హీరోయిన్లలో విజయశాంతి కూడా ఒకరు.
37
మాస్ పాత్రల్లో మెరిసిన విజయశాంతి..
హీరోయిన్ గా కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ఆమె లేడీ ఓరియెంటెడ్, మాస్ యాక్షన్ సినిమాల్లో కూడా నటించి విజయం సాధించింది విజయశాంతి. అంతే కాదు విమెన్ సెంట్రిక్ మూవీస్ హిట్ అవ్వవు అనే అపోహ ఉన్న రోజుల్లో.. స్టార్ హీరోల సినిమాలకంటే ఎక్కువ సక్సెస్ సాధించి.. ఎక్కువ హిట్లు కొట్టిన ఘనత విజయశాంతిదే. అందుకే ఆమెను లేడీ అమితాబచ్చ, లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తుంటారు.
1885 లో రిలీజ్ అయిన ప్రతిఘటన సినిమా విజయశాంతి కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. ఈసినిమాతోనే ఆమె లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కు ప్రాణం పోశారు. ఈ సినిమాతో విజయశాంతిని లేడీ సూపర్ స్టార్ ను చేశాడు దర్శకుడు టి. కృష్ణ. ఈ సినిమా కోసం ఆయన విజయశాంతినే తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట.
కమర్షియల్ హీరోయిన్ గా బిజీగా ఉన్న విజయశాంతి.. డేట్లు అడ్జెస్ట్ చేయలేకపోతే.. ఎన్నిరోజులైనా వెయిట్ చేస్తానని చెప్పారట కృష్ణ. ఈ సినిమా నువ్వే చేయాలమ్మ.. లేకపోతే అసలు ఈసినిమానే చేయను అని చెప్పారట కృష్ణ. అలా విజయశాంతితో ప్రతిఘటన సినిమా చేసి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు దర్శకుడు. అంతే కాదు విజయశాంతి ఇమేజ్ ను కంప్లీట్ గా మార్చేశాడు.
57
విజయశాంతిని ఇమేజ్ మార్చిన గోపీచంద్ తండ్రి
విజయశాంతికి లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ రాడానికి కారణమైన దర్శకుడు కృష్ణ మరెవరో కాదు.. ప్రస్తుత టాలీవుడ్ హీరో గోపీచంద్ తండ్రి. టి. కృష్ణ వారసుడిగానే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు గోపీచంద్. ఈ విషయాన్ని రీసెంట్ గా కొన్ని ఇంటర్వ్యూలలో కూడా ప్రస్తావించారు విజయశాంతి. ఇక ప్రతిఘటన తరువాత 1990లో విడుదలైన కర్తవ్యం సినిమా విజయశాంతి మూవీ కెరీర్ లో మైలురాయిగా నిలిచింది.
ఇందులో ఆమె పోషించిన పాత్రకు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి. ఈ సినిమాలో ఆమె పాత్రకు గానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. కర్తవ్యం సినిమా తరువాతే విజయశాంతికి లేడీ అమితాబ్ అన్న పేరు వచ్చింది. ఈ సినిమాలో ఆమె యాక్షన్ సీన్స్ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి.
67
యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా
విజయ శాంతి యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఆమె చేసిన సినిమాలు ఆడియన్స్ ను బాగా ఆకర్శించాయి.తన కెరీర్ లో నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు విజయశాంతి. సౌత్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా విజయశాంతికి వరుసగా అవకాశాలు వచ్చాయి. 1989లో అనిల్ కపూర్ నటించిన హిందీ చిత్రం ఈశ్వర్లో ఆమె లలిత పాత్రలో కనిపించారు.
ఈ పాత్రకు కూడా ఆమె ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు.విజయశాంతి, సినీ కెరీర్ పీక్స్ లో ఉండగానే రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. సినిమాలకు కొంతకాలం విరామం ఇచ్చిన ఆమె, 2000ల దశకంలో పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారించారు.
77
విజయశాంతి రీ ఎంట్రీలో...
లాంగ్ గ్యాప్ తరువాత 2020లో మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆమె కీలకమైన పాత్రను ఆమె పోషించారు. రీ ఎంట్రీలో చాలా సెలక్టీవ్ గా సినిమాలు చేస్తున్నారు విజయశాంతి. వచ్చిన ప్రతీ అవకాశానికి ఒకే చెప్పకుండా సెలక్టీవ్ గా వెళ్తున్నారు.
రీసెంట్ గా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో వచ్చిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో ఐపీఎస్ వైజయంతిగా విజయశాంతి కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాతో మరోసారి ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.