చర్మ వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్ మమతా మోహన్ దాస్, క్యాన్సర్ పోయిందనుకుంటే మరో సమస్య

Published : Jan 16, 2023, 12:24 PM IST

క్యాన్సర్ తో పోరాడి జయించిన హీరోయిన్ ను మరో సమస్య తగులుకుంది. ఇప్పుడిప్పుడే ఆరోగ్యం కుదుటపడుతుంది అనుకుంటే.. మరో సమస్య ఇబ్బంది పెడుతుంది. మలయాళ  తార మమతా మోహన్ దాస్ పరిస్తితి పాపం అనేలా ఉంది.   

PREV
17
చర్మ వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్ మమతా మోహన్ దాస్, క్యాన్సర్ పోయిందనుకుంటే మరో సమస్య

ఫిల్మ్ సెలబ్రిటీలతో చాలా మందిని అనారోగ్యసమస్యలు వెంటాడుతున్నాయి. వేధిస్తున్నాయి. డబ్బు, పలుకుబడి,ఇమేజ్, స్టార్ డమ్ ఉన్నా.. అనారోగ్యం ఇబ్బంది పెడుతుండటంతో..మనశ్శాంతి కోల్పోతుననారు స్టార్లు. ప్రస్తుతం మలయాళ హీరోయిన్ మమతా మోహన్ దాస్ పరిస్థితి కూడా సరిగ్గా ఇలానే ఉంది. 

27

ఎందుకో ఈ మధ్య హీరోయిన్ల పరిస్థితే ఇలా అవుతుంది. స్టార్ హీరోయిన్  సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడి చాలా ఇబ్బందులు పడుతుంది. అటు పూనమ్ కౌర్.. బాలీవుడ్ లో దీపికా లాంటి వారు అనారోగ్యంతో ఇబ్బందులు పడినవారే ప్రస్తుతం సౌత్ హీరోయిన్ కమ్ సింగర్ మమతా మోహన్ దాస్  అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. 

37

సౌత్ సినిమాలో స్టార్ ఇమేజ్ సాధించిన మమతా మోహన్ దాస్ విటిలిగో అనే చర్మ సమస్య బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.  ఈ చర్మ రుగ్మత బారిన పడిన వారి చర్మంపై మచ్చలు ఏర్పడతాయి. రోజులు గడిచే కొద్ది మచ్చల పరిమాణం పెరుగుతుంటుంది. శరీరం రంగు కూడా మారుతుంటుంది. 

47

ఈ సందర్భంగా మమత సోషల్ మీడియాలో  ఎమోషనల్ ట్వీట్ చేసింది. ప్రియమైన సూర్య భగవంతుడా... ఇప్పుడు నేను నిన్ను ఎంతో ప్రేమతో హత్తుకుంటున్నా. నా శరీరం రంగు మారుతోంది. అందుకే నీవు రాక ముందే నీ కోసం నిద్ర లేచి.. నీ కిరణాల కోసం ఎదురు చేస్తున్నా. నీ శక్తిని నాకు అందించు. నా జీవితంలో ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాను' అని పోస్ట్ చేసింది. 

57

మమత గతంలో క్యాన్సర్ బారిన పడి కోలుకుంది. క్యాన్సర్ టైమ్ లో కూడా గుర్తు పట్టకుండా అయిపోయింది మమతా మోహన్ దాస్. అయినా సరే.. ఆత్మవిశ్వాసం కోప్లోకుండా. వ్యాధితో పోరాడి కోలుకుంది. సాధారణ జీవితాన్ని గడుపుతూ వస్తోంది.  ఇంతలోనే ఆమె మరో సమస్య బారిన పడటం  ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

67

టాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది మమతా మోహాన్ దాస్. ముఖ్యంగా ఎన్టీఆర్ తో నటించన యమదొంగ సినిమా.. తో పాటు.. చింతకాయల రవి, కింగ్ , కేడి లాంటిసినిమాలు ఆమెకు మంచి పేరును తీసుకు వచ్చాయి. క్యాన్సర్ నుంచి కోలుకున్నాక కూడా సినిమాలు చేసింది మమత. ప్రస్తుతం మలయాళంలో నటిస్తూనే ఉన్నారు. 

77

ఇక పాటల విషయానకి వస్తే.. తెలుగులోనే ఎక్కువ పాటలుపాడింది మమత. ఆమె ఎక్కువగా కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్  డైరెక్షన్ లె ఎక్కువగా పాటలు పాడింది. సూపర్ హిట్ సాంగ్స్ ను ఆలపించింది మమతా మోహన్ దాస్. ఇక సోషల్ మీడియాలో ఆమె ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు.. మమత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. 
 

click me!

Recommended Stories