Ennenno Janmala Bandham: ఖుషి నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ.. యశోదర్ కు షాకిచ్చిన అభిమన్యు!

Navya G   | Asianet News
Published : Mar 24, 2022, 12:14 PM IST

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Enneno Janmala Bandam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ కథ కూడా బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
16
Ennenno Janmala Bandham: ఖుషి నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ.. యశోదర్ కు షాకిచ్చిన అభిమన్యు!

ఇక ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే వేద (Vedha)  స్కెత స్కోప్ ఇచ్చే సాకుతో మీరు వెనక్కి వచ్చారు అని యశోదర్ ను అంటుంది. దాంతో యశోదర్ వెనక్కి వస్తే నాకేంటి లాభం అని అడగగా.. నా దగ్గర మార్కులు కొట్టేద్దామని అని వేద (Vedha)  అంటుంది. దాంతో యశోదర్ నీకంత సీన్ లేదు అని అంటాడు.
 

26

ఆ తర్వాత వేద ఫన్నీగా యశోదర్ ను బయటకు పంపిస్తుంది. ఆ తర్వాత యశోదర్ (Yashodhar) వాళ్ళ ఫ్రెండ్ యానివర్సరీ కి వేద ను తీసుకు వెళ్ళడానికి చిరాకు పడతాడు. ఆ తర్వాత యశోదర్ (Yashodhar) వాళ్ళ ఫ్రెండ్ నిఖిల్.. మాళవికను కూడా పార్టీ కి ఇన్వైట్ చేస్తాడు.
 

36

దాంతో అభిమన్యు (Abhimanyu) పార్టీలో యశోదర్ కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అంటూ రాక్షస ఆనందం పొందుతాడు. మరోవైపు యశోదర్ దంపతులు పార్టీ కి వెళ్లడానికి సిద్ధమవుటుంటారు. ఆ తర్వాత ఖుషి (Khushi) ఒక ఫ్లవర్ తీసుకొని దాన్ని వాళ్ళ నాన్నకు ఇచ్చి వాళ్ళ అమ్మ జడలో పెట్టమని అంటుంది.
 

46

ఇక దాంతో ఫ్యామిలీ మొత్తం ఎంతో ఆనందపడతారు. ఇక యశోదర్ (Yashodhar) ఫ్లవర్ ను వేద జడలో పెడతాడు. ఆ తర్వాత ఇద్దరూ కారులో పార్టీ కి వెళ్తారు. పార్టీకి వెళ్లిన యశోదర్ (Yashodhar) దంపతులు డ్రింక్స్ తాగుతూ ఉంటారు. ఈలోపు అక్కడకు అభిమన్యు (Abhimanyu) వాళ్లు కూడా వస్తారు.
 

56

ఇక వాళ్ళను చూసిన యశోదర్ కొంత ఆశ్చర్యంగా చూసి ఆ తర్వాత తగ్గేదే లే.. అన్నట్టు తన పని తాను చేసుకుని పోతాడు. ఆ తర్వాత అభిమన్యు (Abhimanyu) యశోదర్ ను ఒక దగ్గర కలిసి నా ఖుషి ను నా దగ్గర నుంచి లాగేసుకున్నావు అని అంటాడు. అంతేకాకుండా ఖుషి (Khushi) నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ అని అంటాడు.
 

66

దాంతో యశోదర్ ఒక్కసారిగా స్టన్ అవుతాడు. అదే క్రమంలో అభిమన్యు (Abhimanyu) మాళవిక కు నాకు మధ్య ఉన్న ప్రేమకు పుట్టిన కూతురు అని అంటాడు. దానికి యశోదర్ (Yashodhar)  ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి. అంతేకాకుండా  అభిమన్యు మాటలు వెనకాల ఉన్న కారణం ఏమిటో చూడాలి.

click me!

Recommended Stories