RRR Facts: రాజమౌళి అద్భుత సృష్టి `ఆర్‌ఆర్‌ఆర్‌` గురించి ఈ 10 ఎగ్జైటింగ్‌ ఫ్యాక్ట్స్ మీకు తెలుసా?

Published : Mar 24, 2022, 12:12 PM IST

`ఆర్‌ఆర్‌ఆర్‌` సునామీకి ఇంకా ఒక్క రోజే మిగిలి ఉంది. సినీ ప్రియులంతా ఉత్కంఠతో వెయిట్‌ చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన పది ఎగ్జైటింగ్‌ ఫ్యాక్ట్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

PREV
19
RRR Facts: రాజమౌళి అద్భుత సృష్టి `ఆర్‌ఆర్‌ఆర్‌` గురించి ఈ 10 ఎగ్జైటింగ్‌ ఫ్యాక్ట్స్ మీకు తెలుసా?
rrr unknown facts

దర్శకధీరుడు రాజమౌళి మదిలోనుంచి పుట్టిన అద్భుత సృష్టి `ఆర్‌ఆర్‌ఆర్‌` విడుదలకు సర్వం సిద్ధమైంది. భారీ ప్రమోషన్స్ తో, భారీ అంచనాలతో రాబోతుందీ సినిమా. కనీ వినీ ఎరుగని విధంగా రాజమౌళి, తారక్‌, చరణ్‌ దేశ వ్యాప్తంగా ఈ సినిమాపై ప్రచారం చేశారు. అనేక ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, ప్రెస్‌మీట్లు నిర్వహించారు. సినిమాని జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రాణం పెట్టారు. తీరిక లేకుండా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సినిమాపై హైప్‌ పెంచేందుకు తాము చేయాల్సిన అన్ని పనులు చేశారు. 
 

29
rrr unknown facts

గురువారం రాత్రి నుంచి ప్రీమియర్స్ పడబోతున్నాయి. బెనిఫిట్‌ షోల టికెట్‌ ధర వేలల్లో పలుకుతుంది. దాదాపు ఐదు వేల వరకు ఒక్కో టికెట్‌ పలుకుతుందని సమాచారం. మరోవైపు భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలు సైతం పది రోజులపాటు టికెట్‌ రేట్లు పెంచుకునే అవకాశాన్నిచ్చాయి. మరోవైపు పదివేలకు పైగా స్క్రీన్లలో ప్రపంచ వ్యాప్తంగా `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమాని ప్రదర్శించబోతున్నారు. దీంతోపాటు ఎన్టీఆర్‌ తన ఫ్యామిలీకి ఈ సినిమాని అందరికంటే ముందుగా చూపించబోతున్నారు. ఏఎంబీలో ఫ్యామిలీ కోసం గురువారం రాత్రి 9కి స్పెషల్‌ షో ప్లాన్‌ చేశారు. 

39
rrr unknown facts

ఇలాంటి ఆసక్తికర విషయాల నేపథ్యంలో `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమాకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను, తెలియని నిజాలు, ఎగ్జైటింగ్‌ ఫ్యాక్ట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం. మొదట గా ఈ చిత్రంలో హీరోలుగా రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ నటించారు. కానీ ఈ కథ అనుకున్నప్పుడు రాజమౌళి మదిలోగానీ, రైటర్‌ విజయేంద్రప్రసాద్‌ మైండ్‌లోగానీ వేరే హీరోలున్నారట. రజనీకాంత్‌-అర్జున్‌, సూర్య-కార్తీలతో అనుకున్నారట. అయితే ఇది జస్ట్ ఐడియా మాత్రమే అని, ఆ తర్వాత మంచి ఫ్రెండ్‌షిప్‌ ఉన్న టాలీవుడ్‌ హీరోలు ఎవరు అనుకున్నప్పుడు ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ గుర్తొచ్చారట. అలా ఈ ప్రాజెక్ట్ వారి వద్దకు వెళ్లిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయేంద్రప్రసాద్‌ చెప్పారు. 
 

49
rrr unknown facts

రెండో ఫ్యాక్ట్స్.. `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా చేయడానికి తనని ఇన్‌స్పైర్‌ చేసింది చెగువేరా `మోటర్‌ సైకిల్‌ డైరీ` అని చెప్పారు దర్శకుడు రాజమౌళి. ఆయన చేసిన జర్నీ ప్రధానంగా `మోటర్‌ సైకిల్‌ డైరీ` పుస్తకం రాశారు, దాన్ని సినిమాగానూ తీశారు. అలా తెలుగు ఫ్రీడమ్‌ ఫైటర్స్ కొమురంభీమ్‌, అల్లూరి సీతారామరాజు 1920 టైమ్‌లో ఒకే సారి వీరిద్దరు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. ఎక్కడికి వెళ్లారో తెలియదు, ఏం చేశారో తెలియదు. కానీ వచ్చినప్పుడు మాత్రం యుద్ధ వీరులుగా వచ్చారు. ఆ తర్వాత కొమురంభీమ్‌ నైజాంకి వ్యతిరేకంగా, అల్లూరి బ్రిటీష్‌కి వ్యతిరేకంగా పోరాడారు. అయితే వీళ్లు బయటకు వెళ్లినప్పుడు ఏం చేశారనేది ఫిక్షన్‌ కథాంశంతో ఈ కథని రాసుకున్నట్టు రాజమౌళి తెలిపారు. 
 

59
rrr unknown facts

మూడో ఫ్యాక్ట్..`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా దాదాపు పది భాషల్లో విడుదల కాబోతున్నట్టు తెలుస్తుంది. వాటిలో ప్రధానంగా తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలున్నాయి. అయితే ఎన్టీఆర్‌, చరణ్‌ తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ వంటి భాషల్లో సొంతంగా డబ్బింగ్‌ చెప్పినట్టు సమాచారం. నాల్గో ఫ్యాక్ట్‌.. ఎన్టీఆర్‌కి జోడీగా మొదట బ్రిటీష్‌ నటి డైసీ ఎడ్గర్‌ జోన్స్ అనుకున్నారు. కానీ ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో మరో బిట్రీష్‌ నటి ఒలివియా మోర్రీస్‌ని ఎంపిక చేశారు. చరణ్‌కి జోడీగా అలియాభట్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.

69
rrr unknown facts

ఐదో ఫ్యాక్ట్ః ఈ సినిమాలో ఫైర్‌(మంట), వాటర్‌ని ప్రధానంగా చూపిస్తూ వస్తున్నారు రాజమౌళి. చరణ్‌ని ఫైర్‌గా, ఎన్టీఆర్‌ని వాటర్‌గా చూపించారు. ఇందులోని కొమురంభీమ్‌, అల్లూరి పాత్రల ప్రవర్తనని బట్టి దీన్ని డిజైన్‌ చేశారట. అల్లూరి ఎప్పుడు ఆవేశంగా, ఫైరింగ్ యాటిట్యూడ్‌తో ఉంటారని, కొమురంభీమ్‌ కూల్‌గా, గుంబనంగా ఉంటారని, ఆయా పాత్రల తీరుతెన్నులను బట్టి ఈ కాన్సెప్ట్ ని ఎంచుకున్నారట. మొదట వీరిద్దరికి పడదని,  భీకర పోరు తర్వాత కలిసిపోతారని తెలుస్తుంది. 

79
rrr unknown facts

ఆరో ఫ్యాక్ట్.. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌,చరణ్‌, అలియాతోపాటు బాలీవుడ్‌, విదేశీ నటులు కూడా ఉన్నారు. బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగన్‌ కీలక పాత్రలో కనిపిస్తారు. అలాగే శ్రియా మరో ముఖ్య మైన పాత్ర పోషిస్తుంది. నెగటివ్‌ రోల్స్ లో ఐరీష్‌ నటులు అలీసన్‌ డూడీ, రే స్టీవెన్‌సన్‌ కనిపించబోతున్నారు. వారి పాత్రలు సైతం బలంగా ఉంటాయని సమాచారం. ఏడో ఫ్యాక్ట్.. ఈ చిత్రాన్ని ఇండియాతోపాటు విదేశాల్లోనూ చిత్రీకరించారు. హైదరాబాద్‌, అరకు, మహభళేశ్వరంతోపాటు ఉక్రేయిన్‌లోనూ చిత్రీకరించారు. `నాటు నాటు` సాంగ్‌ని కీవ్లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఆ నగరం రష్యా దాడుల్లో ధ్వంసమవుతుంది.

89
rrr unknown facts

ఎనిమిదో ఫ్యాక్ట్.. `ఆర్‌ఆర్ఆర్‌` సినిమాన 2017లో కార్యరూపం దాల్చింది. ఎన్టీఆర్‌, చరణ్‌లతో చేయాలని రాజమౌళి అనుకున్నారు. ఆ సమయంలో ముగ్గురు కలిసి దిగిన ఫోటోని విడుదల చేశారు. 2018లో ప్రెస్‌మీట్‌ పెట్టి సినిమా విశేషాలను తెలిపారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు సినిమా వాయిదా పడింది. గాయాల కారణంగా ఒకసారి వాయిదా పడితే, కరోనా కారణంగా మూడు సార్లు వాయిదా పడింది. దీంతో బడ్జెట్‌ చాలా పెరిగింది. మొదట సినిమాకి అనుకున్న బడ్జెట్‌ 336కోట్లు. కానీ ఇప్పుడు సుమారు 480కోట్లు అయినట్టు ఇటీవల ఏపీకి సమర్పించిన రిపోర్ట్ లో వెల్లడించారు. అంటే దాదాపు వంద కోట్లకుపైగా ఎక్ట్సా ఖర్చు అయినట్టు తెలుస్తుంది. 

99
rrr unknown facts

తొమ్మిదో ఫ్యాక్ట్... ఈ సినిమా దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. అయితే తెరపై ఈ చిత్రం 3డీలో, ఐమాక్స్ ఫార్మాట్‌తోపాటు డాల్బీ సినిమాస్‌ వెర్షన్‌లోనూ విడుదల కాబోతుంది. థియేటర్ల స్క్రీన్లని బట్టి ఆయా ఫార్మాట్‌లో సినిమా రిలీజ్‌ కానుంది. పదో ఫ్యాక్ట్.. ఈ చిత్రానికి సంబంధించి అప్పుడే మొదటి రివ్యూ వచ్చేసింది. ఓవర్సీస్‌ సెన్సార్‌ బోర్డ్ సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్‌ సంధు సినిమాకి ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ ఇచ్చారు. ఎన్టీఆర్‌, చరణ్‌ నటన అద్భుతమని, ఎన్టీఆర్‌ పాత్ర ప్రాణమని, ఈ చిత్రంతో రాజమౌళి దేశంలోనే నెంబర్‌ వన డైరెక్టర్‌ అవుతారని, ఇప్పుడు `ఆర్‌ఆర్‌ఆర్` బ్లాక్‌బస్టర్‌ సినిమా అని, భవిష్యత్‌లో చరిత్రలో నిలిచిపోయే క్లాసిక్‌ అని వెల్లడించడం విశేషం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories