ఆమె చెబుతూ, తాను హీరోయిన్ గా ఎంట్రీ పదేళ్లు పూర్తయ్యిందని చెప్పిన మాళవిక, ఇకపై తాను బలమైన కథ, ప్రాధాన్యత కలిగిన చిత్రాల్లోనే నటించాలని నిర్ణయించుకున్నట్టు చెప్పింది. అది ఐదు వందల కోట్లు వసూలు చేసే భారీ బడ్జెట్ చిత్రమైనా సరే తన పాత్రకి ప్రయారిటీ లేకపోతే సినిమా చేసేందుకు అంగీకరించనని తెలిపింది. అలాంటి సినిమాలు హిట్ అయినా, తన పాత్రకు గుర్తింపు దక్కదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పిందీ మల్లు సోయం.