ఇలాంటి నీఛమైన మహిళలు బాలీవుడ్ లో చాలామంది ఉన్నారు, ఇప్పుడు ఇంకొకటి వచ్చింది..ఆమెపై స్టార్ హీరోయిన్ కామెంట్స్

First Published | Oct 13, 2024, 5:21 PM IST

బాలీవుడ్ నటి మల్లికా శెరావత్ గురించి పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు బోల్డ్ చిత్రాలతో, గ్లామర్ ప్రదర్శనతో మల్లికా శెరావత్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. మర్డర్ చిత్రంతో మల్లికా శెరావత్ బోల్డ్ హీరోయిన్ గా పాపులర్ అయింది.

బాలీవుడ్ నటి మల్లికా శెరావత్ గురించి పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు బోల్డ్ చిత్రాలతో, గ్లామర్ ప్రదర్శనతో మల్లికా శెరావత్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. మర్డర్ చిత్రంతో మల్లికా శెరావత్ బోల్డ్ హీరోయిన్ గా పాపులర్ అయింది. రొమాంటిక్ సన్నివేశాల్లో నటించేందుకు మల్లికా ఎలాంటి నిబంధనలు పెట్టుకోలేదు. 

అయితే ఆ రొమాంటిక్ చిత్రాల వల్లే తాను దారుణంగా అవమానాలకు గురైనట్లు మల్లికా పేర్కొంది. మర్డర్ చిత్రంతో నాకు ఊహించని క్రేజ్ వచ్చింది. చాలా మంది నా పెర్ఫామెన్స్ ని మెచ్చుకున్నారు. అభిమానులు అయ్యారు. కానీ టాప్ సెలెబ్రిలు కొందరు నన్ను దారుణంగా తిట్టారు. ఇంత చెండాలంగా నటించడానికి సిగ్గు లేదా అని తిట్టిపోశారు. 

Also Read: గ్రాండ్ గా నారా రోహిత్ నిశ్చితార్థం..పెళ్లి గురించి అప్పుడే హింట్ ఇచ్చిన హీరోయిన్, అతడిపై ఇష్టాన్ని ఇలా


ఒక టాప్ హీరోయిన్ అయితే ఒక మహిళని తినకూడని మాటలతో నన్ను తిట్టింది. బాలీవుడ్ లో చాలా మంది నీఛమైన మహిళలు ఉన్నారు. ఇప్పుడు నువ్వొచ్చావు.. పెద్ద విషయం కాదు అంటూ అసభ్యకరమైన మాట ఉపయోగించింది. వెంటనే నాకు ఏడుపు వచ్చింది. నిర్మాత మహేష్ భట్ దగ్గరకి వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నా. ఆయన తనకి ధైర్యం చెప్పినట్లు మల్లికా పేర్కొంది. 

అదే విధంగా దర్శకుల వల్ల కూడా ఇబ్బందులు పడ్డా. సౌత్ లో ఒక దర్శకుడు సాంగ్ షూటింగ్ సమయంలో విచిత్రమైన కామెంట్స్ చేశారు. హీరో నీ నడుముపై చెపాతీలు వేసే సన్నివేశం చిత్రీకరించాలనుకుంటున్నా. నువ్వు ఎంత హాట్ గా ఉంటావో చూపించడమే ఆ సన్నివేశం ఉద్దేశం అని అన్నాడు. మరీ ఇలా కూడా ఆలోచిస్తారా అని అనుకున్నా. ఆ సన్నివేశానికి తాను అంగీకరించలేదని మల్లికా పేర్కొంది. 

Latest Videos

click me!