ఇక మహేష్ కెరీర్‌లో అతడు నటించిన సినిమాలను చూసుకుంటే ఒక సినిమా హిట్ అయితే.. ఆ తర్వాత సినిమా ప్లాప్ అయ్యేది. ఆ తర్వాత ఒకటి హిట్టయితే రెండు ప్లాప్ అయ్యేవి. ఇలా మహేష్ సినీర్ కెరీర్ పడుతూ.. లేస్తూ.. కొనసాగేది. అయితే ఈ మధ్య మాత్రం సినిమాల విషయంలో చాలా జాత్రగ్గగా ఉంటున్నాడు మహేష్.
వరుసగా హిట్ సిసిమాలు చేస్తున్నాడు. అయితే చాలా గ్యాప్ తర్వాత మహేష్ బాబుకు వరుసగా దూకుడు, బిజినెస్‌మాన్, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమాలతో మూడు వరుస హిట్లు దక్కాయి.
ఆ తర్వాత మళ్లీ వన్ నేనొక్కడినే, ఆగడు లాంటి రెండు డిజాస్టర్ సినిమాలు.. ఆ వెంటనే శ్రీమంతుడు హిట్టైనా.. స్పైడర్ మళ్ళి డిజాస్టర్ అయింది. మళ్ళీ భరత్ అనే నేను సినిమాతో హిట్ కొట్టాడు. ఇక మహర్షి, సరిలేరునీకెవ్వరు.. సర్కారువారి పాట, గుంటూరు కారం లాంటి సిసిమాలతో భారీ బ్లాక్ బస్టర్లు కాకపోయినా...ఓ మోస్తరు హిట్లు కొట్టాడు మహేష్.
Also Read: కమల్ హాసన్ చెంప పగలగొట్టిన హీరోయిన్ ఎవరో తెలుసా..?