మహేష్‌ బాబుని నమ్రత ముద్దుగా ఏమని పిలుస్తుందో తెలుసా? మహేష్‌ వద్దని చెప్పినా నమ్రత లీక్‌

Published : Oct 05, 2024, 04:20 PM IST

మహేష్‌ బాబు, నమ్రత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికి ముద్దుపేర్లున్నాయి. అయితే మహేష్‌ని తాను ఇంట్లో ముద్దుగా ఏమని పిలుస్తుందో తెలిపింది నమ్రత.   

PREV
16
మహేష్‌ బాబుని నమ్రత ముద్దుగా ఏమని పిలుస్తుందో తెలుసా? మహేష్‌ వద్దని చెప్పినా నమ్రత లీక్‌

సూపర్‌ స్టార్‌ మహేష్‌ ఒకప్పుడు చాలా సైలెంట్‌గా ఉండేవాడని, అమ్మాయిలతో పెద్దగా మాట్లాడేవాడు కాదని, హీరోయిన్లతోనూ అలానే ఉండేవాడనే కంప్లెయింట్‌ ఉంది. తన భార్య నమ్రతనే చాలా సార్లు చెప్పింది. మొదట్లో ఆయన్ని చూసి వామ్మో ఇలా ఉన్నాడేంటి? అనుకుందట. క్రమంగా ఆయన్ని మార్చేసినట్టు తెలిపింది. ఒకప్పుడు అసలేం మాట్లాడేవాడు కాదని, కానీ ఇప్పుడు తనకంటే ఆయన ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలిపింది నమ్రత. అంతే కాదు, ఈ ఇద్దరి మధ్య అనుబంధానికి సంబంధించిన మరో విషయం ఇప్పుడు బయటకు వచ్చింది.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

26

నమ్రత ఇంట్లో మహేష్‌ బాబుని ఏమని పిలుస్తుందనేది లీక్‌ అయ్యింది. బేసిక్‌గా ఇంట్లో వైఫ్ అండ్‌ హౌజ్బెండ్‌ మధ్య ముద్దుపేర్లు చాలా ఉంటాయి. చాలా రొమాంటిక్‌గానూ ఉంటాయి. అయితే మహేష్‌ బాబుకి కూడా నమ్రత అలాంటి రొమాంటిక్‌ పేరే పెట్టింది. ఇంట్లో ఆ పేరుతోనే పిలుచుకుంటుందట. అయితే ఈ విషయాన్ని బయటకు చెప్పొందని మహేష్‌ బాబు చెబుతున్నా, వినకుండా అసలు విషయం లీక్‌ చేసింది నమ్రత. దెబ్బకి అంతా షాక్‌ అయ్యారు. మరి మహేష్‌ ని నమ్రత ఏమని పిలుస్తుంది? ఆయనకు ఉన్న ముద్దు పేరేంటి అనేది చూస్తే.. 
 

36

మహేష్‌ని ఇంట్లో అంతా నాని అని పిలుస్తారట. ఇది చాలా వరకు ఓపెన్‌ సీక్రెటే. మహేష్‌ బాబునే ఓ ఈవెంట్‌లో ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఓ సినిమా ఈవెంట్‌లో దర్శకుడు పూరీ జగన్నాథ్‌.. మహేష్ బాబుని ఇంటర్వ్యూ చేశాడు. సరదాగా కొన్ని ప్రశ్నలు అడిగారు. అందులో భాగంగా మిమ్మల్ని ఇంట్లో ఏమని పిలుస్తారని అడగ్గా మహేష్‌.. `నాని` అని చెప్పాడు. ఇది అందరికి తెలుసు అని వెల్లడించారు. ఆ తర్వాత నమ్రత ముద్దుగా ఏమని పిలుస్తుందని అడిగాడు పూరీ. ఈ ప్రశ్నకి మహేష్‌ క్రేజీ ఆన్సర్‌ ఇచ్చారు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేం, ఇవన్నీ పర్సనల్‌ అని తెలిపాడు. అయినా పూరీ వినలేదు. ఫోర్స్ చేశాడు. మహేష్‌ కూడా చెప్పను అని తెలిపాడు. 
 

46

దీంతో లాభం లేదని భావించిన పూరీ.. ఇక నమ్రతని అడిగారు. మహేష్‌ని ఇంట్లో ఏమని పిలుస్తారని అడిగారు. ఆమె ముందు ఆలోచించింది. మహేష్‌ కల్పించుకుని చెప్పొందన్నాడు. కానీ నమ్రత చెప్పేసింది. అసలు విషయం లీక్‌ చేసింది. ఇంట్లో మహేష్‌ని ముద్దుగా `బేబీ` అని పిలుచుకుంటానని తెలిపింది. దెబ్బకి పూరీ తోపాటు ఈవెంట్‌లో ఉన్న ఫ్యాన్స్ అంతా అరుపులతో హోరెత్తించారు. ఇది ఈవెంట్‌లోనే హైలైట్‌గా నిలిచింది. మహేష్‌బాబుతో పూరీ జగన్నాథ్‌ `పోకిరి`, `బిజినెస్‌ మేన్‌` సినిమాలు చేశారు. మహేష్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ `పోకిరి` కావడం విశేషం. ఈ మూవీతోనే ఆయన సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. ఈ మూవీ అప్పట్లో కలెక్షన్ల రికార్డులు తిరగరాసింది. టాలీవుడ్‌ కి కలెక్షన్ల టేస్ట్ చూపించింది. ఆ తర్వాత మళ్లీ వీరి కాంబినేషన్‌ సెట్‌ కాలేదు. పూరీ చాలా ప్రయత్నాలు చేసినా మహేష్‌ రిజెక్ట్ చేస్తూ వస్తున్నారు. 
 

56

ఇక నమ్రత, మహేష్‌ బాబు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. `వంశీ` చిత్రంలో ఈ ఇద్దరు కలిసి నటించారు. ఈ మూవీ షూటింగ్‌ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. కొన్నాళ్లు ట్రావెల్‌ చేసిన ఈ ఇద్దరు పెళ్లికి రెడీ అయ్యారు. అయితే మొదట్లో వీరి మ్యారేజ్‌కి ఇంట్లో నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాలేదని సమాచారం. మహేష్‌ అక్క మంజూల.. తండి సూపర్‌ స్టార్‌ కృష్ణతో రాయబారం నడిపించింది. మొదట్లో ఓకే చెప్పని ఆయన ఆ తర్వాత గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. అలా సైలెంట్‌గా ముంబాయిలో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు గౌతమ్‌, సితార ఉన్నారు. గౌతమ్‌ స్టడీస్‌లో బిజీగా ఉన్నారు. సితార సైతం స్టడీస్‌ కొనసాగిస్తూనే యాడ్స్, యూట్యూబ్‌లో వీడియోలు చేస్తుంది. సినిమాలపై ఫోకస్‌తోనే ఉంది. భవిష్యత్‌లో ఆమె సినిమాల్లోకి వచ్చే ఆలోచన ఉందని చెప్పింది. అందుకు కాస్త టైమ్‌ పట్టే ఛాన్స్‌ ఉంది. 

66

మహేష్‌ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్ లో దీన్ని తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుంది. ఆఫ్రికన్‌ అడవుల నేపథ్యంలో యాక్షన్‌ అడ్వెంచర్‌గా సినిమా ఉండబోతుందట. దీనికోసం సరికొత్త మేకోవర్‌లోకి మారిపోయారు మహేష్‌. ఇటీవల ఆయనబయట కొత్త లుక్‌లో కనిపించి షాక్‌ ఇచ్చారు. రాజమౌళి సినిమా కోసమే అది అని తెలుస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కాబోతుందని సమాచారం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories