ఈరోజు ఎపిసోడ్ లో జానకి(janaki)కి దెబ్బ తగలలేదు అని తెలుసుకున్న రామచంద్ర,జానకి పై కోప్పడుతూ ఉండగా ఇంతలో జానకి వెళ్లి రామచంద్రని హత్తుకుంటుంది. ఆ తరువాత రామచంద్ర ఇలాంటి ప్రయత్నాలు ఇంకొకసారి చేయకండి అని చెప్పి షాప్ కి వెళ్తాను అని అనగా మరి అత్తయ్య గారికి ఏం చెప్పి వెళ్తారు అని అనగా రామచంద్ర(rama chandra)ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు.