ఇటీవల విడుదలైన సర్కారు వారి పాట ట్రైలర్ దూసుకుపోతోంది. ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా మహేష్ క్యారెక్టరైజేషన్ కేక పెట్టించే విధంగా ఉంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. పోకిరి, దూకుడు తర్వాత మహేష్ నటిస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీ ఇదే. మహేష్ ఫ్యాన్స్ ఆకలి తీర్చేందుకు డైరెక్టర్ పరశురామ్ సర్కారు వారి పాట రూపంలో పర్ఫెక్ట్ మాస్ ప్యాకేజ్ అందించబోతున్నారు.
27
Mahesh Babu
ఇటీవల విడుదలైన సర్కారు వారి పాట ట్రైలర్ దూసుకుపోతోంది. ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా మహేష్ క్యారెక్టరైజేషన్ కేక పెట్టించే విధంగా ఉంది. మహేష్ బాబు ట్రైలర్ లో డైలాగ్స్, కామెడీ టైమింగ్, యాక్షన్ తో అదరగొట్టేస్తున్నాడు.
37
ఇదిలా ఉండగా ఈ చిత్ర కథ లీకైంది. దర్శకుడు పరశురామ్ సింపుల్ స్టోరీని పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేయబోతున్నారు. ఈ చిత్రం అప్పు, డబ్బు చుట్టూ తిరగనుంది. లీకైన సర్కారు వారి పాట చిత్ర కథ ప్రకారం.. మహేష్ బాబు ఫారెన్ లో ఉంటూ అప్పులు ఇస్తుంటాడు. అప్పు తీసుకున్న వారి నుంచి ఎలాగైనా ముక్కు పిండి వసూలు చేస్తుంటాడు. అదే క్రమంలో హీరోయిన్ పరిచయం కావడం జరుగుతుంది. దీనితో మహేష్ దగ్గర హీరోయిన్ కూడా అప్పు తీసుకుంటుంది.
47
అనుకోని పరిస్థితితుల వల్ల మహేష్ బాబు హీరోయిన్ తో కలిసి ఇండియాకు రావాల్సి వస్తుంది. ఇక్కడే మహేష్ బాబు తన అసమైన ఆపరేషన్ మొదలు పెడతాడు. పోకిరి తరహాలో.. విలన్స్ గ్యాంగ్ లో చేరుతాడు. వాళ్లకు అప్పు ఇస్తూ కావాల్సిన పని చేసి పెడతాడు. ఘరానా మోసాలు చేసే సముద్ర ఖనికి మహేష్ బాబుకి బెడిసికొడుతుంది.
57
అసలు మహేష్ బాబు విలన్స్ గ్యాంగ్ లో ఎందుకు చేరాల్సి వచ్చింది అనేది కథలో అసలైన ట్విస్ట్. మహేష్ బాబుకి తన తండ్రి రూపంలో ప్లాష్ బ్యాక్ ఉంటుంది. మహేష్ తండ్రి ఇలాగే అప్పులు ఎక్కువగా ఇచ్చి మోసపోయి ఉండవచ్చు. అతడి ఫ్యామిలీ వీధిన పడ్డప్పుడు ఊహించని విషాదం జరిగి ఉండొచ్చు.
67
తన తండ్రికి జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని మహేష్ డబ్బు విషయంలో రాటుదేలుతాడు. ఎంతటి వారి నుంచి అయినా వడ్డీతో సహా వసూలు చేస్తాడు. అప్పు అనేది ఆడపిల్ల తండ్రి లాంటిది.. ఎంతో బాధ్యతగా ఉండాలి' అనే డైలాగులు ట్రైలర్ లో వినిపించేది అందుకే. ఇక్కడ ఎవడూ బాధ్యతగా లేదు అని కూడా మహేష్ అంటాడు.
77
మహేష్ తండ్రి ఎవరు.. ఆయన ఎలా మోసపోయారు.. తన తండ్రికి జరిగిన అన్యాయానికి మహేష్ రివేంజ్ ఎలా తీర్చుకున్నాడు అనేది అసలైన కథ. చూస్తుంటే పరశురామ్ సమాజంలో జరుగుతున్న సంఘటనలతో ఇన్స్పైర్ అయినట్లు అనిపిస్తోంది. అప్పు విషయంలో బాధ్యతగా ఉండాలిగా అని చెప్పడం వెనుక కారణం బ్యాంకులకు వేల కోట్ల అప్పులు ఎగవేసిన విజయ్ మాల్యా లాంటి వారి సంఘటనలు అయి ఉండొచ్చు. ఏది ఏమైనా డైరెక్టర్ పరశురామ్ సర్కారు వారి పాట అవుట్ పుట్ ని అద్భుతంగా రాబట్టినట్లు తెలుస్తోంది. మహేష్ పాత్రలో ఫన్ తో పాటు ఎమోషనల్ డెప్త్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.