Janaki Kalaganaledu: కుటుంబ పరిస్థితి బాధపడుతున్న జ్ఞానాంబ.. వెన్నెలను ఇంట్లో నుంచి పంపించే ప్రయత్నంలో మల్లిక?

Published : Jan 21, 2023, 12:08 PM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జనవరి 21వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..  

PREV
18
Janaki Kalaganaledu: కుటుంబ పరిస్థితి బాధపడుతున్న జ్ఞానాంబ.. వెన్నెలను ఇంట్లో నుంచి పంపించే ప్రయత్నంలో మల్లిక?

ఈరోజు ఎపిసోడ్లో అఖిల్ కోపంతో నిన్ను పెళ్లి చేసుకుంది రోజు ఇలా నీతో క్లాసులు పీకించుకోవడానికి కాదు అనడంతో నేను నీకు బాధ్యతలు గుర్తు చేయడం కూడా తప్పేనా అఖిల్ అని అంటుంది. 17 రోజులకు ఒకసారి టెస్టులు చేయించాలి మెడిసిన్స్ కావాలి మన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి అంటే మనకు డబ్బులు కావాలి అంటుంది. మంచి తిని తిండాలి వాడి కోసమైనా డబ్బులు కావాలి కదా అనగా అలా అని అడ్డమైన పనులు చేయమంటావా అనడంతో ఇంట్లో మనం తినే ప్రతి ఒక ముద్ద మీ అన్నయ్య గారికి కష్టార్జితం అంటుంది జెస్సి .
 

28

ఇన్నాళ్లు మా వదిన అనుకున్న ఇప్పుడు నువ్వు కూడా నాకు దాపరించావా అనుకుని అక్కడినుంచి వెళ్తుండగా నేను జాబ్ చేయమంటావా అఖిల్ అనడంతో నువ్వు ఉద్యోగం చేయడం అంటే నా చెప్పుతో నేను కొట్టుకున్నట్టే అని అక్కడినుంచి వెళ్ళిపోతాడు అఖిల్. ఆ తర్వాత జ్ఞానాంబ గోవిందరాజుకి సేవలు చేస్తూ ఉంటుంది. వాళ్లు కుటుంబ పరిస్థితులు తెచ్చుకుని బాధపడుతూ ఉంటారు. శరీరానికి తగిలిన గాయం తొందరగా మానుతుంది కానీ మనసుకు తగిలిన గాయం అంత తొందరగా మానదు అంటుంది. ఇంతలోనే వెన్నెల అక్కడికి వచ్చి గోవిందరాజులు కి సేవ చేస్తూ ఉంటుంది. పండగ అయిపోగానే నువ్వు మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో వెన్నెల అనడంతో నువ్వు నన్ను ఎందుకు వెళ్ళిపోమంటున్నావు నాకు అర్థం అయింది..
 

38

 అమ్మ నేను ఏమి చిన్నపిల్లని కాదు అని నువ్వే అన్నావు కదా అంటుంది. అక్కడ నానమ్మ కాదు ఈ ఇంట్లో ఏ సౌకర్యాలు లేకుండా నేను ఇబ్బంది పడతానని నువ్వు అభిప్రాయపడుతున్న అంతే కదా అమ్మ అంటుంది. ఎన్ని చెప్పినా నేను ఈ పరిస్థితులలో మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళను అమ్మ అంటుంది. ఆ మాటలు జానకి విని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు జ్ఞానాంబ బాధపడుతూ ఉంటుంది. అది చూసి జానకి బాధతో ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు రామచంద్ర పని కోసం వేరే అతనితో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలోనే నిన్ను మోసం చేసిన ఫ్రెండు చరణ్ వెళ్తున్నాడు అనుకుని కారును ఫాలో అయ్యి వెళ్లి చూడగా తీరా అక్కడికి వెళ్లేసరికి అతను లేకపోవడంతో రామచంద్ర అతనికి స్వారీ చెబుతాడు. 
 

48

ఆ తర్వాత వెన్నెల బట్టలు ఉతుకుంటూ ఉండగా ఇంతలో జానకి అక్కడికి వస్తుంది. రాకరాక ఇంటికి వచ్చావు కష్టపడుతున్నావు ఇవన్నీ ఎందుకు నేను చూసుకుంటాను కదా అనడంతో మన పనే కదా వదినా అని అంటుంది. ఏం వదిన మీరు కష్టపడుతుంటే నేను చూస్తూ ఊరుకోవాలా అనడంతో అందుకే అత్తయ్య నిన్ను అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళమని చెప్పింది అని అంటుంది. చిన్నప్పటి నుంచి నువ్వు కష్టపడితే వాళ్ళు చూడలేదు కానీ ఇప్పుడు నువ్వు కష్టపడుతుంటే వాళ్ళు చూసి తట్టుకోలేరు అందుకే వెళ్ళమని చెబుతున్నారు అంటుంది జానకి. మా ఇంట్లో అందరూ నా గురించి ఆలోచిస్తున్నారు అంటే బాగానే ఉంది నువ్వు నా గురించి ఇంతగా ఆలోచిస్తుంటే చాలా సంతోషంగా ఉంది వదిన అంటుంది వెన్నెల.
 

58

నీ చదువు ఎంతవరకు వచ్చింది వదిన అనడంతో మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నాను రాత్రి సమయాల్లో చదువుకుంటున్నాను అనడంతో సరే వదిన అంటుంది వెన్నెల. ఏదైనా అనుకున్నది నెరవేరుస్తావు చేస్తావు వదిన నాకు నమ్మకం ఉంది అనడంతో జానకి వెన్నెలను హత్తుకుంటుంది. ఇంతలోనే మల్లిక అక్కడికి వచ్చి అందరూ ఒక్కటైనట్లు ఇది కూడా జానకి పార్టీలో చేరిపోయింది ఏంటి చెప్తాను దీని సంగతి అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత విష్ణు చెక్ బుక్ తీసుకోగా ఇంతలో మల్లిక అక్కడికి వచ్చి ఎందుకు అది తీసుకున్నారు అనడంతో నువ్వు కూర్చో మల్లిక అప్పుడు విష్ణు నేను చెబుతాను అంటాడు విష్ణు.
 

68

ప్రతి ఏడాది పండక్కి అన్నయ్య మనకు బట్టలు తీసిస్తాడు కదా ఈసారి మన దగ్గర ఉన్న డబ్బులు నుంచి ఒక పది వేలు తీసి అమ్మ వాళ్లకు ఇస్తాను అనడంతో ఏంటి ఇచ్చేది అని గట్టిగా అరుస్తుండగా గట్టిగా అరవకు మల్లిక అమ్మ వాళ్లకు వినిపిస్తుంది అని అంటాడు విష్ణు. ఇప్పుడు డబ్బులు ఇచ్చారు అంటే ప్రతిసారి మన దగ్గర ఏదో లక్షలు డబ్బులు ఉన్నట్లు వాళ్లు మన వైపు చూస్తారు అంటుంది మల్లిక. మన దగ్గర డబ్బులు ఉన్నాయి నాలో కోరికలు పుడుతున్న చంపుకుంటే మీరు మన దగ్గర డబ్బులు ఉన్నాయని వాళ్లకు చెప్పేసేలా ఉన్నారు అంటుంది మల్లిక. ఈ కష్టాలకు కారణమైన మీ అన్నయ్య ఈ పండగే ఎలాగో అలా జరిపిస్తాడు మీరు నోరు మూసుకొని ఉండండి అని విష్ణువుని నోరు మూయిస్తుంది మల్లిక.
 

78

ఆ తర్వాత మల్లిక బయటికి వెళ్తుండగా వెన్నెల కూరగాయలు తరుగుతూ ఉండడంతో అక్కడికి వెళుతుంది. అక్కడికి వచ్చి వెన్నెల మీద దొంగ ప్రేమలు కురిపిస్తూ మీ అమ్మ వాళ్ళు నిన్ను మహారాణిలా చూసుకున్నారు. నీకు ఈ పనులన్నీ ఎందుకు నేను చేస్తానులే అని అంటుంది. జానకి, బావగారి పుణ్యమా అని మనం ఈ పరిస్థితుల్లో ఉన్నాము లేదంటే నువ్వు వస్తున్నావంటే అందరూ కలిసి నీకు ఎదురొచ్చే వాళ్ళము అని అంటుంది మల్లిక. అప్పుడు మల్లిక ఎన్ని మాటలు మాట్లాడినా వెన్నెల నవ్వుతూ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది. అక్కడే ఉండకుండా కష్టాలను వెతుక్కుంటూ ఈ దరిద్రాన్ని అనుభవించడానికి వచ్చావా అనగా కష్టాలు ఎక్కువ రోజులు ఉండవులే వదినా అని అంటుంది.
 

88

నీకు చెప్పాల్సింది చెబుతున్నాను అప్పు లక్షల్లో ఉంది.  ఎప్పుడు మనం ఈ అప్పు తీర్చాలి ఒక ఇంటికి ఎప్పుడు వెళ్లాలి నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో వెన్నెల అని వెన్నెల మనసును చెడగొడుతూ ఉంటుంది. నా మాట విని ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో వెన్నెల లేదంటే వీళ్ళు నీ పెళ్లి కూడా చేయలేరు అప్పుడు ఇబ్బంది పడతావు అని మల్లిక అంటుండగా వెన్నెల మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అప్పుడు వెన్నెల సరే వదిన నువ్వు చెప్పినట్టు చేస్తాను కానీ నా స్థానంలో నువ్వుంటే ఇలాగే మీ అమ్మ నాన్న నీ వదిలేసిన వెళ్ళిపోతావా అనడంతో మల్లిక నోరు మూసుకుంటుంది. అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను అని ఎంత మల్లిక అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు జానకి ఎదురు పడుతుంది.

click me!

Recommended Stories