`కాంతార` దక్షిణ కన్నడకి చెంది భూత కోలా సాంప్రదాయ పండుగ నేపథ్యంలో సాగుతుంది. అడవి ప్రజల పల్లె సంస్కృతిని, సంప్రదాయాలను అద్దం పట్టేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. అంతేకాదు అంతర్లీనంగా భూస్వాములు, పేదలు, అణగారిన వర్గాలపై దోపిడిని, అసమానతలను చర్చించిన చిత్రమిది. పెద్దవాళ్లు అడవి జనాలను ఎలా వాడుకుంటారో, ఎంతగా తక్కువగా చూస్తారనే విషయాన్ని ఇందులో దర్శకుడు రిషబ్ శెట్టి కళ్లకు కట్టినట్టు చూపించారు. దీనికితోడు దైవత్వం ఈ సినిమా సక్సెస్‌లో పెద్ద పీట వేసిందని చెప్పొచ్చు.